బిగ్‌బీకి ట్విట్టర్‌లో కోటికి పైగా ఫాలోవర్లు | Sakshi
Sakshi News home page

బిగ్‌బీకి ట్విట్టర్‌లో కోటికి పైగా ఫాలోవర్లు

Published Tue, Sep 2 2014 3:02 AM

బిగ్‌బీకి ట్విట్టర్‌లో కోటికి పైగా ఫాలోవర్లు - Sakshi

ముంబై: సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఉత్సాహంగా ట్వీట్లు ఉంచే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ‘ట్విట్టర్‌లో కోటి మంది! యా..! నన్ను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నా తర్వాత లక్ష్యం రెండు కోట్లే’ అంటూ అమితాబ్ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ట్విట్టర్‌లో వినోదాత్మకంగా స్పందించే అమితాబ్ ఇప్పటిదాకా 33 వేల ట్వీట్లు ఉంచడం విశేషం. ట్విట్టర్‌లో కొత్త ప్రయోగాలతో ట్రెండ్ సృష్టిస్తున్న అమితాబ్ ఇటీవల బచ్చన్‌బోల్ ఖాతాను ప్రారంభించి, ప్రతి బుధవారం ఫాలోవర్లతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Advertisement
Advertisement