బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కెరీర్ టాప్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది వరుస విజయాలు ఆమెను వరించాయి. అమెరికా టీవీ సిరీస్ 'క్వాంటికో' నటించడం ఆమెకు ప్రశంసలు తెచ్చిపెడితే.. దిల్ ధడక్నే దో, బాజీరావు మస్తానీ వంటి సినిమాలు విజయాలను ఇచ్చాయి. దీనికి తోడు ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో విజేతకు పురస్కారం అందజేసే అరుదైన గౌరవం కూడా ప్రియాంకను వరించింది. ఈ ఆనందం ఇలా కొనసాగుతుండగా మరోవైపు హాలీవుడ్ ఆఫర్లు ఈ అమ్మడి గుమ్మం ముందు ఎదురుచూస్తున్నాయి.
తాజాగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ కూడా ఈ దేశీగర్ల్ పై మనసు పారేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేనాల్డ్స్ మాట్లాడుతూ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ఆమెతో కలిసి నటించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 'నేను ఆమె నటించిన 'క్వాంటికో' చూడలేదు. కానీ ఆమె ఇంటర్వ్యూలు చూశాను. చాలా చార్మింగ్ గా ఉంది. ఆమెకు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గొప్పగా నటిస్తోంది. ఆమెతో కలిసి పనిచేయడాన్ని నేను ఇష్టపడతాను. ఎందుకు ఆమె అంతా బిగ్ స్టార్ అయిందో నేను స్వయంగా చూస్తాను' అని 'డెడ్ పూల్' స్టార్ రేనాల్డ్స్ పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమాల గురించి కూడా ఆయన కొనియాడారు. బాలీవుడ్ సినిమాలు తనకు ఎంతగానో నచ్చుతాయని, అవి ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన అన్నారు.
ఆమెతో నటించాలని ఉంది!
Published Thu, Feb 4 2016 8:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement