'రారండోయ్.. వేడుక చూద్దాం' ఫస్ట్ లుక్స్ | Sakshi
Sakshi News home page

'రారండోయ్.. వేడుక చూద్దాం' ఫస్ట్ లుక్స్

Published Wed, Mar 29 2017 10:16 AM

'రారండోయ్.. వేడుక చూద్దాం' ఫస్ట్ లుక్స్ - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. నాగార్జున హీరోగా 'సొగ్గాడే చిన్ని నాయనా' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయినా నిన్నే పెళ్లాడతా తరహాలో నాగచైతన్యకు ఈ సినిమా మెమరబుల్ హిట్గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో దర్శకుడు కళ్యాన్ కృష్ణ, నిర్మాత నాగార్జునలు రెండు డిఫరెంట్ మోడల్స్ను సెలెక్ట్ చేయటంతో రెండు పోస్టర్లను ఒకేసారి రిలీజ్ చేశారు. నాగ్ సెలెక్ట్ చేసిన పోస్టర్లో నాగచైతన్య యాక్షన్ మోడ్లో కనిపిస్తుంటే.., డైరెక్టర్ సెలెక్ట్ చేసిన పోస్టర్ టైటిల్ను జస్టిఫై చేస్తూ పండుగ వాతావరణం కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆడియో, సినిమా రిలీజ్ డేట్ లను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement