2020 సంక్రాంతి బరిలో ప్రభాస్‌ | Sakshi
Sakshi News home page

2020 సంక్రాంతి బరిలో ప్రభాస్‌

Published Tue, Apr 2 2019 11:38 AM

Darling Prabhas Go For Two Releases In Five Months Gap - Sakshi

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలు పూర్తి చేయడానికి ప్రభాస్‌ నాలుగేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు. అయితే బాహుబలి తరువాత అయినా డార్లింగ్ వరుస సినిమాలతో అలరిస్తాడనుకుంటే సాహో లాంటి భారీ సినిమాతో మరోసారి ఆలస్యం చేశాడు. కానీ తదుపరి చిత్రం విషయంలో మాత్రం ప్రభాస్‌ వేగంగా పావులు కదుపుతున్నాడు.

ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సాహో సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మరో ఐదు నెలల గ్యాప్‌తో జిల్‌ ఫేం రాధకృష‍్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ జాన్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్‌ చేసిన డార్లింగ్ ఐదు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement