మీపై గూగుల్ కన్నేసింది! | Sakshi
Sakshi News home page

మీపై గూగుల్ కన్నేసింది!

Published Wed, Aug 20 2014 2:18 AM

మీపై గూగుల్ కన్నేసింది! - Sakshi

లండన్: వారాంతంలో ఏదైనా విహార యాత్రకు వెళ్లారా..? లేదా ఏదైనా పనిమీద మరో ప్రాంతానికి వెళ్లారా..? ఇలా మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళుతున్నా... ఒకరు కనిపెట్టేస్తున్నారు! మీరు వెళ్లే చోట్ల వివరాలను దాచిపెడుతున్నారు.. జాగ్రత్త మరి! ఇలా మీపై నిఘా పెట్టిందెవరో తెలుసా?.. గూగుల్ సంస్థ. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు, ‘గూగుల్ నవ్’ను వినియోగిస్తున్నవారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్లినా.. అది మీ గూగుల్ అకౌంట్‌లో నిక్షిప్తమైపోతుంది.

కొద్ది నెలల పాటు ఆ వివరాలు గూగుల్ సర్వర్లలో ఉంచుతారు కూడా. కావాలంటే ‘గూగుల్ నవ్’లోకి వెళ్లి చూసుకుంటే... మీరు కొద్దిరోజులుగా ఎక్కడెక్కడికి వెళ్లినదీ మ్యాప్‌పై ఎరుపురంగు చుక్కలతో చూపిస్తుంది. అయితే గూగుల్‌లో ఈ సర్వీసు తప్పనిసరేమీ కాదని, కావాలంటే ఈ మొబైల్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేసుకోవచ్చని గూగుల్ సంస్థ చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్ వినియోగిస్తేనే ఇదంతా జరుగుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement