2017 నాటికి చైనాలో డ్రైవర్‌లెస్ సబ్‌వే | Sakshi
Sakshi News home page

2017 నాటికి చైనాలో డ్రైవర్‌లెస్ సబ్‌వే

Published Mon, Aug 29 2016 9:45 PM

2017 నాటికి చైనాలో డ్రైవర్‌లెస్ సబ్‌వే

బీజింగ్: ఏడాదిలోగా డ్రైవర్‌లెస్ సబ్‌వేను ప్రారంభించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. 2017 నాటికి పూర్తిస్థా   డ్రైవర్‌లెస్ సబ్‌వేలో ప్రయాణాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్నిరకాల వసతులతో నిర్మిస్తున్న ఈ సబ్‌వేలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మార్గం నిర్వహణ మొత్తం పూర్తి ఆటోమేటిక్‌గా ఉంటుందని, రైలు ఆగడం, డోర్ల తెర్చుకోవడం, మూసుకోవడం, క్లీనింగ్ వంటి పనులన్నీ ఆటోమేటిగ్‌గానే జరిగిపోతాయని తెలిపారు.

‘మేడ్ ఇన్ చైనా 2025’కార్యక్రమంలో భాగంగా ఈ సబ్‌వే మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. 2010లోనే ఈ సబ్‌వే పనులను ప్రారంభించిన చైనా కేవలం దేశీయంగా మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. 2020 నాటికి 300 కిలోమీటర్ల సబ్‌వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రైళ్ల ద్వారా ప్రజారవాణాలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న చైనా ఈ సబ్‌వే వ్యవస్థతో మరింతగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని చెబుతున్నారు.

Advertisement
Advertisement