ఆ స్కూల్‌లో సెల్‌ఫోన్‌ కనిపిస్తే బండకేసి కొట్టుడే | Sakshi
Sakshi News home page

ఆ స్కూల్‌లో సెల్‌ఫోన్‌ కనిపిస్తే బండకేసి కొట్టుడే

Published Wed, Jun 28 2017 4:39 PM

ఆ స్కూల్‌లో సెల్‌ఫోన్‌ కనిపిస్తే బండకేసి కొట్టుడే

బీజింగ్‌: అది చైనాలోని గిజో ప్రావిన్స్‌. అందులో యోంగ్మావో అనే ఓ మాధ్యమిక పాఠశాల ఉంది. తాము ఒకపక్క పాఠాలు చెబుతుంటే విద్యార్థులు మాత్రం సెల్‌ఫోన్‌లలో దూరిపోయి విపరీతంగా బ్రౌజింగ్‌ చేయడంతోపాటు వీడియో గేమ్‌లతో ఎంజాయ్‌ చేస్తుండటంతో ఏం చేయాలో అర్థం కానీ ఓ చైనా పాఠశాల చివరకు కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడ సెల్‌ఫోన్‌ కనిపిస్తే అక్కడే దానిని లాగేసుకొని ముందు నీళ్లలో ముంచేసి ఆ తర్వాత సుత్తెతో పగులగొట్టేస్తున్నారు.

అంతేకాదు, ఇక ముందు ఎవరూ కూడా సెల్‌ఫోన్లు స్కూల్‌ ఆవరణంలోకి తీసుకురావొద్దని, ఒక వేళ ఏదైనా కారణంతో తీసుకువచ్చినా వాటిని ముందు టీచర్లకు ఇవ్వాలని తరగతులు పూర్తయ్యాకే తీసుకోవాలని, అలా జమ చేయకుండా తమ వద్దే పెట్టుకున్నట్లు తెలిస్తే మాత్రం పగలగొట్టేస్తామని స్కూల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. పిల్లల్లో క్రమ శిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయాలు తప్పవని తెలిపింది. పిల్లలు ఉపాధ్యాయులకు ఒక కోణంలో తెలిస్తే తల్లిదండ్రులు మాత్రం వేరే కోణాల్లో ఆలోచిస్తారని, తాము విద్య నేర్పాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని వివరించింది. ఒకేసారి విద్యార్థులందరిని పిలిపించి తాము లాగేసుకున్న ఫోన్లన్నింటిని నీళ్లలో ముంచేసి సుత్తెతో వారి కళ్ల ముందే టపాటపా పగులగొట్టేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ చర్యకు పచ్చ జెండా ఊపగా నెటిజన్లలో కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు.

Advertisement
Advertisement