సర్కారుపై బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజం | Sakshi
Sakshi News home page

సర్కారుపై బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజం

Published Sun, Aug 28 2016 1:41 AM

సర్కారుపై బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజం - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి అసెంబ్లీ నిర్వహణపై చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా, ఇక్కడ మాత్రం మొక్కుబడి సమావేశాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. జీఎస్‌టీ బిల్లును తూతూ మంత్రంగా ఆమోదించడానికే సమావేశాలను నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు నిర్వహించాలని, కొత్త జిల్లాల ఏర్పాటు, మహారాష్ట్రతో ఒప్పందం, ప్రాజెక్టుల రీ డిజైన్,  వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

శనివారం అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలను సభ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంతకు ముందు బీజేఎల్పీ కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement