కెల్విన్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కెల్విన్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Mon, Jul 24 2017 4:44 PM

కెల్విన్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు - Sakshi

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసుతో కెల్విన్‌కు ఎటువంటి సంబంధం లేదని అతడి తరపు న్యాయవాది రేవన్‌ అన్నారు. ‘సిట్‌’  దగ్గర ఆధారాలుంటే కోర్టుకు ఇవ్వాలని సూచించారు. సిట్‌ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు దారుణంగా సాగుతోందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కెల్విన్‌ అమాయకుడని, అతడు డ్రగ్స్‌ అమ్ముతున్నాడన్నది అవాస్తమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం లేదన్నారు.

సినిమా వాళ్లకు డ్రగ్స అమ్మినట్టు కెల్విన్‌ సమాచారం ఇచ్చాడని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. కెల్విన్‌ సమాచారం ఇచ్చాడన్నది అబద్దమని, ఇవన్నీ పోలీసులు సృష్టించినవేనని పేర్కొన్నారు. దీనిపై అకున్‌ సబర్వాల్ బృందం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కెల్విన్‌ను కలవనీయడం లేదని, తల్లిదండ్రులు కూడా చూసేందుకు అనుమతించడం లేదని వెల్లడించారు. ఏదో ఆరోపణ చేస్తే సంకెళ్లు వేసేస్తారా, అతడి హక్కులను కాలరాస్తారా అని ప్రశ్నించారు. అతడితో సంబంధాలున్నాయని ఎవరు ఒప్పుకున్నారో వెల్లడించాలని రేవన్‌ డిమాండ్‌ చేశారు.

కెల్విన్‌పై మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి కోర్టులో వాడుకుంటామని మీడియా ప్రతినిధితో అన్నారు. కెల్విన్‌ పేరు కూడా పూర్తిగా మీడియాకు తెలియదని, అతడి పేరు కాల్విన్‌ అని చెప్పారు.

Advertisement
Advertisement