వెజ్జా... నాన్‌వెజ్జా? | Sakshi
Sakshi News home page

వెజ్జా... నాన్‌వెజ్జా?

Published Tue, Mar 3 2015 8:30 AM

వెజ్జా... నాన్‌వెజ్జా?

అధరాలకు అందాలద్దే లిప్‌స్టిక్ వెజ్జా? నాన్‌వెజ్జా? ఇదేం ప్రశ్న... అదేమి తినేది కాదు కదా అనుకుంటున్నారా! అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం లిప్‌స్టిక్ దేనికిందకు వస్తుందో చెప్పితీరాలంటోంది. సౌందర్య సాధానాలతో పాటు సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్ లాంటి వాటిపై కచ్చితంగా అదేంటో చెప్పే సింబల్ ఉండాలట.

 

జంతువుల నుంచి తీసిన పదార్థాలేమైనా (నూనె, కొవ్వు, ఎముకల పొడి తదితరాలు) వాడితే సదరు ఉత్పత్తిపై ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉండాలని, పూర్తిగా శాఖాహార సంబంధ పదార్థాలే వాడితే ఆకుపచ్చ రంగు చుక్క ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 16, 2014న ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై రెకిట్ బెన్కిసర్ అనే కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తినే పదార్థాల విషయంలో ఇలా అడిగితే ఓకేగాని, సౌందర్య సాధనాలు, సబ్బుల లాంటి వాటికి ఇలా అడగడంలో అర్థం లేదని వాదిస్తోంది. నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరింది. మే 18లోగా స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది.

Advertisement
Advertisement