లిటిల్ సైంటిస్ట్స్ | Sakshi
Sakshi News home page

లిటిల్ సైంటిస్ట్స్

Published Tue, Sep 2 2014 1:01 AM

లిటిల్ సైంటిస్ట్స్

...ప్రశ్నించడమే కాదు, ఎన్నో సమస్యలకు సమాధానం కూడా చెప్తామంటున్నారు ఈ చిన్నారి సైంటిస్టులు. జిల్లా విద్యాశాఖ ఎర్రగడ్డ సెరుుంట్ థెరిసా స్కూల్‌లో నిర్వహించిన మూడు రోజుల ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్) ప్రదర్శన
 సోవువారంతో వుుగిసింది. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలల బుల్లి మేధావులు సృష్టించిన ఆవిష్కరణలు అబ్బురపరిచారుు.  
 
 విద్యార్థుల ముఖ్యమైన విధి.. ప్రశ్నించడం. వారిని ప్రశ్నించనివ్వండి
- అబ్దుల్ కలాం
 
 హైడ్రోపోనిక్స్  
 పంట, మొక్కలు పండించడానికి నేలే అక్కర్లేదని, అందులోని న్యూట్రియంట్స్ ఉంటే... ఎక్కడైనా పండిచవచ్చని 18వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు చెప్పారు.
 ఆ విషయాన్ని ఇలా ప్రయోగాత్మకంగా చేసి చూపింది పదో తరగతి చదువుతున్న సుజిత (నారాయణ స్కూల్). దీనివల్ల నీరు మళ్లీ వాడుకోవచ్చు. చీడ పురుగుల బాధ, ప్రకృతికి ఎలాంటి నష్టం ఉండవని ఈ చిన్నారి చెబుతోంది.
 
 వాటర్ ప్యూరిఫయుర్
 ఖర్చు లేకుండా వాటర్ ప్యూరిఫయర్ తయారు చేసుకోవటం ఎలాగో సెయింట్ లూయిస్ హైస్కూల్ నుంచి వచ్చిన అచ్యుత్, వెంకటసాయి, బోసుబాబు ఇక్కడ ప్రదర్శించారు. కుండ, దూది, ఇసుక, కంకర, బొగ్గు, రాళ్లతో రూపొందించిన ఈ పాత్రలో నీరు పోస్తే దాని నుంచి 90 శాతం శుద్ధమైన నీరు వస్తుంది.
 
 బయో సిమెంట్
 కట్టడాలకు వచ్చిన పగుళ్లను పూడ్చడానికి తక్కువ ఖర్చుతో బయో సిమెంట్ రూపొందించుకోవడం ఎలాగో వివరించింది శివరంజని. పనస గింజలతో దీన్ని తయారు చేసుకుంటే, ఖర్చు తక్కువే కాదు.. ఎకో ఫ్రెండ్లీ కూడా అంటోంది ఈ చిన్నారి. ఈ సిమెంట్‌తో రకరకాల వస్తువులు కూడా చేసుకోవచ్చని చూపిస్తోంది.
 
 రోబోటిక్ సర్వెంట్
 ఆ అమ్మాయి ఏ రిమోట్ కారో ఆడుకోవట్లేదు. పేపరు, మొబైల్, కాఫీ అందించడానికి పదిసార్లు అటూ ఇటు తిరిగి అలిసిపోయే అమ్మల కోసం చక్కటి రోబోటిక్ సర్వెంట్‌ని తయారు చేసింది. ఊర్వ మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న సఫియా అఫ్రిన్ ఈ రోబో రూపకర్త.
 
 వాటర్ అలారమ్
 మోటరు వేసి, ఓవర్‌హెడ్ ట్యాంకు నిండే వరకు అక్కడ ఉండలేం. ఎంత సేపట్లో నిండుతుందో కూడా అంచనా ఉండదు. దీనికి పరిష్కారంగా ‘రెయిన్ అలారమ్’ రూపొందించాడు టెన్‌‌త విద్యార్థి చైతన్య (రెరుున్‌బో ఇంటర్నేషనల్ స్కూల్). ఒక ట్యాబ్లెట్, క్లిప్, వైర్లు, బ్యాటరీ, చిన్న మ్యాగ్నెట్‌తో దీన్ని చేశాడు. దీని క్లిప్ మీద నీటి చుక్క పడగానే శబ్దం వస్తుంది. దీంతో నీరు ఓవర్ ఫ్లో అరుుతే ఇట్టే తెలిసిపోతుంది.
 -  ఓ మధు

Advertisement

తప్పక చదవండి

Advertisement