అందం | Sakshi
Sakshi News home page

అందం

Published Sun, Mar 29 2015 10:58 PM

అందం

పొడి జుత్తు కలవారు కొబ్బరి పాలలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే పొడిదనం పోయి జుత్తు మృదువుగా తయారవుతుంది.

జుత్తు రాలడాన్ని అరికట్టాలంటే... తలస్నానం చేసే ముందు బియ్యం కడిగిన నీళ్లతో తడపాలి. కాసేపు అలానే నాననిచ్చి ఆపైన కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలపడి జుత్తు రాలడం ఆగుతుంది.

వ్యాక్సింగ్ చేశాక కొన్నిసార్లు చేతుల మీద, కాళ్ల మీద నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గుడ్డు తెల్లసొనలో తేనెను కలిపి రాసుకుంటే మచ్చలు మాయమవుతాయి.

Advertisement
Advertisement