గీత దాటితే వేటే! | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే!

Published Wed, Apr 23 2014 1:08 AM

election  Violation political parties activities

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయాన్ని అదుపు చేసేందుకు నియమించిన స్టాటిక్ సర్విలెన్స్ బృందాలు, ఫ్టైయింగ్ స్క్వాడ్‌లు, వీడియో సర్వెలెన్స్ బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందా లు, అకౌంటింగ్, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుస్తాయని, అప్పటి ను ంచి ప్రతిరోజూ కీలకమేనన్నారు. 
 
 రాజకీయ పార్టీలు నిబంధనలు అతిక్రమించి ప్రచారం కోసం ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల వ్యయ  నియంత్రణ కోసం బృందాలన్నీ సమన్వయంతో పని చేయాలని సూచించారు. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు సమాచారం అందగానే మెరుపు దాడులు చేయాలన్నారు. ఎన్నికలయ్యే వరకు అనుమానం ఉన్న ప్రతి చోటను తనిఖీలు చేయూలని స్టాటిక్ సర్వెలెన్స్ కమిటీలకు సూచిం చారు. ఈ బృందాలు ఎస్. కోట నియోజకవర్గంలో తప్ప మిగతా నియోజకవర్గాల్లో చురుగ్గా పని చేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇకపై అన్ని నియోజకవర్గాల్లోనూ విరివిగా తిరగాలని ఆదేశించారు. మండలాలకు వచ్చి వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే తెలియజేయాలని వెంటనే నియమిస్తామని చెప్పారు. బృం దాల ఫోన్‌నంబర్లు మండల కేంద్రాల్లో అందరికీ తెలిసేలా ప్రదర్శించాలన్నారు.
 
 మోడల్ కోడ్‌పై నిఘా
 ప్రతి నియోజకవర్గంలోనూ మోడల్ కోడ్‌ను పరిశీలించేందుకు మూడు నుంచి నాలుగు ప్లెయింగ్  స్వ్కాడ్‌లను నియమించామన్నారు.  ఈ బృం దం మద్యం, డబ్బు ,సంఘ వ్యతిరేక శక్తులను గుర్తించటం, ఓటర్ల ను ప్రలోబాలకు గురి చేయడమే కాకుండా ఓటింగ్ చేసేందుకు విఘాతం  కలి గించే వారిని గుర్తించాలన్నారు. పార్టీలపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలన్నారు. వీడియో సర్వెలెన్సు బృందాల ద్వారా సమాచారం తెచ్చుకుని రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. చీపురుపల్లి, ఎస్. కోట, విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయ పరిమితులు దాటొచ్చని అధికారులు అంచనా వేశారని, అక్కడ దృష్టి సారించాలన్నారు.  
 
 ప్రతి సమావేశాన్ని రికార్డు చేయాలి
 ఎన్నికల్లో అభ్యర్థులు నిర్వహించే ప్రతి సమావేశాన్నీ రికార్డు చేయాలని కలెక్టర్ వీడియో బృందాలను ఆదేశించారు. సభలకు ఎంతమంది హాజరైనది లెక్క వేయూలన్నారు. కుర్చీలు, మైకులు, కటౌట్లు, ఫ్లెక్సీలు, లైట్‌లతో పాటు అన్ని రకాల సామగ్రిని లెక్క వేయూలని చెప్పారు.ఖర్చు వివరాలను షాడో ఎక్స్‌పెండిచర్ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ అంశంపైనే ఎన్నికల వ్యయమంతా ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల వ్యయం అంచ నాల్లో ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ధర ఛార్టును అనుసరించాలని పేర్కొన్నారు. అభ్యర్థి సమర్పించిన వ్యయానికి సహాయ వ్యయ పరిశీలకుడు  నమోదు చేసిన వ్యయానికి తేడాలుంటే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే అభ్యర్థుల బ్యాంకు అకౌంట్ ద్వారా జరిగే లావాదేవీలను కూడా తనిఖీ చేయాలన్నారు. అనంతరం ఆయన మండలాల వారీగా కమిటీలు చేపడుతున్న పనితీరు ను సమీక్షించారు.  ఈ సమావేశంలో ఎస్పీ తస్సీర్ ఇక్బాల్, జేసీ బి. రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మోహనరావు, ఎక్సైజ్ ఉప కమిషనర్ సురేందర్, ఖజానా శాఖ ఉప సంచాలకుడు పివి భోగారావు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement