అప్‌కమింగ్ కెరీర్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోలేని మధురమైన ఘట్టం. ఇద్దరి మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. ఆధునిక జీవితాలు తీరికలేకుండా బిజీబిజీగా మారిపోయా యి. పెళ్లి వేడుకల కోసం ఎక్కువ సమయం వెచ్చించలేని పరిస్థితి. మారుతున్న కాలానికి తగ్గట్టు వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు. సంతృప్తికి, ప్రశంసలకు, ఆదాయానికి లోటులేని కెరీర్.. వెడ్డింగ్ ప్లానింగ్. నేటి కార్పొరేట్ యుగంలో వెడ్డింగ్ ప్లానర్లకు డిమాండ్ పెరిగింది.
వీరికి మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ప్రారం భంలో ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో పనిచేసి తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వివాహాల నిర్వాహకులు ఎన్నో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ల అభిరుచులు, అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వివాహ వేడుక జరిపించాలి. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి, పెళ్లి జరిగి, అప్పగింతలయ్యేదాకా అన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించాలి. వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అధిక శ్రమతో కూడుకున్న వృత్తి. ఇందులో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
అర్హతలు: వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా విద్యార్హతలు లేవు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు చదవాలి. ఈ కోర్సుల్లో భాగంగా వెడ్డింగ్ ప్లానింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారెందరో ఉన్నారు.
వేతనాలు: వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అనేక విభాగాల కలబోత. సాధారణంగా కో-ఆర్డినేటర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. మూడేళ్లపాటు పనిచేసి అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందుకోవచ్చు. ఆపరేషన్స్ మేనేజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు లక్ష రూపాయల దాకా పొందొచ్చు. ఇక సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న వెడ్డింగ్ ప్లానర్ వివాహాల సీజన్లో లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించొచ్చు.
ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై
వెబ్సైట్: www.niemindia.com
- తానియా-తాపెల్ వెడ్డింగ్ ప్లానర్ ట్రైనింగ్ అకాడమీ-ముంబై
వెబ్సైట్: www.tania-tapel.com
- ఈవెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్-ముంబై
వెబ్సైట్: www.emdiworld.com
ఓర్పు, మాటతీరే.. పెట్టుబడి
శ్రీ వివాహ మహోత్సవ వేడుక అత్యంత ప్రధానమైంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆత్మీయులు పెళ్లి కార్యక్రమానికి తోడ్పాటును అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పనులను ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి వెడ్డింగ్ ప్లానర్లపై ఆధారపడుతున్నారు. అందమైన వేడుకను ఆహ్లాదభరితంగా నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. శ్రమ ఎక్కువైనా ఓర్పు వహించడం, అతిథులను ఆత్మీయంగా పలకరించడం వంటి లక్షణాలుంటే ఈ రంగంలో రాణించొచ్చు. విద్యార్ధులు, నిరుద్యోగులకు ఇది ఆర్థికంగా వెసులుబాటును ఇచ్చే కెరీర్. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంలో అనుభవాన్ని బట్టి భారీ వేతనాలుంటాయి
- అజ్మత్, ఈవెంట్ మేనేజర్
పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్
Published Wed, Jul 23 2014 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement