రైల్వేలో కొలువుల కూత! | Sakshi
Sakshi News home page

రైల్వేలో కొలువుల కూత!

Published Thu, Jul 2 2015 3:33 AM

Railway howl in the job!

 భారతీయ రైల్వే... ప్రపంచంలోనే అత్యధిక రైల్వే నెట్‌వర్క్ కలిగిన సంస్థల్లో ఒకటి. ప్రతి రోజూ 2.3 కోట్ల ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతూ దేశంలోనే అత్యధిక మంది ఉద్యోగులకు ఉపాధినిస్తోంది. తాజాగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో పలు విభాగాల్లో రెండు వేలకు పైగా టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, అర్హతలు, రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్...

 భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డుల నుంచి జూన్ 27న కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆకర్షణీయ వేతనాలతో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ఈ కొలువులు మంచి అవకాశాలు.
 
 ఖాళీలు:
 రైల్వేలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో కింది విభాగాల్లో సుమారు 2235 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో దక్షిణ మధ్య రైల్వే - సికింద్రాబాద్ పరిధిలో 741 (సీనియర్ సెక్షన్ ఇంజనీర్-302, జూనియర్ ఇంజనీర్-439) పోస్టులున్నాయి.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 1165
జూనియర్ ఇంజనీర్/ రీసెర్చ్ ఇంజనీర్: 935

 విభాగాలు: పీ-వే, బ్రిడ్జ్, వర్క్స్, డ్రాయింగ్ (సివిల్) అండ్ డి జైన్ అండ్ ఎస్టిమేషన్, రీసెర్చ్ ఇంజనీర్, టీఎంఎస్, మెకానికల్, వర్క్‌షాప్, క్యారేజ్ అండ్ వేగన్, డీజిల్ మెకానికల్, జిగ్ అండ్ టూల్, ఎలక్ట్రికల్ (జీఎస్, టీఆర్డీ, టీఆర్‌ఎస్), సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి.

చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 25
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 35
కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 75

 అర్హత:
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో బీఈ లేదా బీటెక్.

జూనియర్ ఇంజనీర్ (జేఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో డిప్లొమా ఉండాలి.

కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మెటలర్జీ/ కెమికల్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంఎస్సీ కెమి స్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అర్హులే.

కొన్ని పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కాకుండా ఇతర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్(ఐటీ) పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి పీజీడీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ/డీవోఈఏసీసీ-ఎ లెవెల్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.

మొత్తం 52 కేటగిరీల పోస్టులున్నాయి. వీటిలో ఉద్యోగం స్వభావాన్ని బట్టి ప్రత్యేక బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా/ ఇతర అర్హతను నిర్దేశించారు. వీటిని పరిశీలించి అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
 
 వయో పరిమితి:
     ఎస్‌ఎస్‌ఈ ఉద్యోగాలకు 2015, జూలై 1 నాటికి 20-34 ఏళ్ల వయసుండాలి.
     జేఈ ఉద్యోగాలకు 2015, జూలై 1 నాటికి 18-32 ఏళ్ల వయసుండాలి.

ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

 ఎంపిక ప్రక్రియ:
 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. చివర్లో వైద్య పరీక్షను కూడా నిర్వహిస్తారు.
 
 పరీక్ష స్వరూపం:
 ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
 
     విభాగం    ప్రశ్నలు
 1.    టెక్నికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్    90
 2.    జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్,
     జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్  60 మొత్తం    150
 
     రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
     ఇంగ్లిష్/హిందీ/ఉర్దూ లేదంటే స్థానిక భాషను మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

 ముఖ్య అంశాలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూలై 26, 2015
పరీక్ష తేది: ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5
 
 పరీక్ష ఫీజు:
 అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించొచ్చు.
 
 దరఖాస్తు విధానం:
     ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌ఈ, జేఈలకు రెండింటికీ అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
వెబ్‌సైట్: rrbsecunderabad.nic.in
 
రిఫరెన్స్
మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - ఆర్‌కే జైన్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- వి.కె.మెహతా
సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - రంగాచారి
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - రాజ్‌పుట్
కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్టివ్- థిమోతీ

Advertisement

తప్పక చదవండి

Advertisement