స్టాటిస్టిక్స్‌లో పీజీ.. | Sakshi
Sakshi News home page

స్టాటిస్టిక్స్‌లో పీజీ..

Published Thu, Aug 27 2015 3:09 AM

MSc Statistics course

ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
 - ఉదయ్, నిర్మల్
 
 మ్యాథమెటిక్స్‌లో ఒక బ్రాంచ్ స్టాటిస్టిక్స్. ఈ సబ్జెక్టుఅధ్యయనం ద్వారా న్యూమరికల్ డేటాను సేకరించడం, దాన్ని క్రమపద్ధతిలో విశ్లేషించడం వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. సాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌ల్లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
 
 అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 
 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది.
 అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 
 తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది.
 అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.svuniversity.ac.in
 
 కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ ప్రోగ్రాం అందిస్తోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ప్రాబబిలిటి, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటి, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లాంటి స్పెషలైజేషన్లు ఉంటాయి.
 
 అర్హత: స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా ఐఎస్‌ఐ నుంచి బీమ్యాథ్ డిగ్రీ లేదా ఐఎస్‌ఐ నుంచి స్టాటిస్టికల్ మెథడ్స్ విత్ అప్లికేషన్స్/స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
 ప్రవేశం: అకడమిక్ రికార్డు, రాతపరీక్ష, ఓరల్ అడ్మిషన్ టెస్ట్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.isical.ac.in
 
 ఉద్యోగావకాశాలు:
 స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్‌స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ లాంటివి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటాయి. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, ఆర్ అండ్ డీ డిపార్ట్‌మెంట్‌లో, విద్యాసంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
 
 పీజీ స్థాయిలో జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 - రమాదేవి, తిరుపతి
 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీ,అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
 అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
 అర్హత: జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.svuniversity.ac.in
 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
 అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. జియాలజీలో పీహెచ్‌డీని అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో జియాలజీలో ఎంఎస్సీ
 ప్రవేశం: పీహెచ్‌డీ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఉద్యోగావకాశాలు:
 ఈ కోర్సు పూర్తిచేశాక యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్‌ల పరీక్షలో ఉత్తీర్ణులవడం ద్వారా కేంద్రప్రభుత్వ కొలువును పొందవచ్చు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్‌ట్రాక్షన్ చేసేటువంటి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 - సుమన్, విశాఖపట్నం
 విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: బీఈ/బీటెక్/బీఆర్క్ లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ లేదా ఎంసీఏ.
 ప్రవేశం: గేట్/ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ).. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: సీఎస్/ ఐటీ/బయోటెక్నాలజీ/ బయోఇన్ఫర్మేటిక్స్‌లో బీఈ/బీటెక్ లేదా ప్రోగ్రామింగ్/మ్యాథమెటిక్స్/ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.iiit.ac.in
 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: 60 శాతం మార్కులతో బీఫార్మసీ/ బీటెక్ లేదా 55 శాతం మార్కులతో బయలాజికల్/అగ్రికల్చరల్ / ఫిజికల్/ కెమికల్/ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
 ప్రవేశం: గేట్ ర్యాంకు/ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.uohyd.ac.in
 

Advertisement

తప్పక చదవండి

Advertisement