లారీ బోల్తా.. ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. ఇద్దరి మృతి

Published Wed, Aug 3 2016 7:46 PM

Two killed in road accident

వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మార్లపాలెం వద్ద బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. చింతలపుడి మండలానికి చెందిన 10 మంది కూలీలు మార్లపాలెం నుంచి మొక్కజొన్నల లోడుతో లారీలో వెళ్తుండగా.. మూల మలుపు వద్ద అదుపుతప్పిన లారీ బోల్తా కొట్టింది. దీంతో లారీ పై కూర్చొని ఉన్న భార్యభర్తలు ఫ్రాన్సిస్(39), లక్ష్మీ(34) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం .

 

Advertisement
 
Advertisement
 
Advertisement