జనవరి 27లోగా నివేదిక ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

జనవరి 27లోగా నివేదిక ఇవ్వాలి

Published Sun, Dec 18 2016 5:05 AM

The report must be given before the January 27

- కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసిన బాలల హక్కుల సంఘం
- ‘బడికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే’ కథనంపై స్పందన


సాక్షి వనపర్తి: ‘బడికి వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక మెయిన్‌ ఎడిషన్‌లో వచ్చిన కథనానికి రాష్ట్ర బాలల హక్కుల సంఘం స్పందించింది. ఈ కథనాన్ని సుమోటోగా స్వీకరించి సంఘం సభ్యుడు అచ్యుతరావు వన పర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతికి శనివారం నోటీసులు జారీ చేశారు. శ్రీరం గాపూర్‌ మండలం శేరిపల్లికి చెందిన 30 మంది విద్యార్థులు శ్రీరంగాపూ ర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు రోజూ జింకలోని బావివాగు దాటి రావాలి.

ఈ సమస్య వల్ల చాలామంది చదువు మధ్యలోనే మానేసినవారు ఉన్నారు. పలువురు బాలికలకు బాల్యవివాహాలు జరిగాయి. ఈ సమస్య పరిష్కారం కా వాలంటే వచ్చే విద్యాసంవత్సరం వరకు వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని.. లేదంటే శేరి పల్లిలోనే ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై జనవరి 27లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement