మానవత్వం చూపిన హి(వ)జ్రాలు.. | Sakshi
Sakshi News home page

మానవత్వం చూపిన హి(వ)జ్రాలు..

Published Sat, Aug 29 2015 9:24 AM

మానవత్వం చూపిన హి(వ)జ్రాలు.. - Sakshi

    రైలులో మహిళకు పురిటి నొప్పులు..
     ప్రసవం జరిపిన హిజ్రాలు

 
 ఆలేరు: హిజ్రాలు.. మానవత్వం చూపడంలో వజ్రాలని నిరూపించుకున్నారు. రైలులో వెళ్తున్న మహిళకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం జరిపారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మా య, చోటు దంపతులు బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా భోపాల్‌కు వెళ్తున్న గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ప్రాంతంలోకి రాగానే మాయకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్ర యాణికులకు ఎటూ పాలు పోవడం లేదు. ఇంతలో ఇదే బోగీలోకి ప్రవేశించిన వరంగల్‌కు చెందిన హిజ్రాలైన నిహారిక, జాస్మి న్, లూసియాలు పురిటి నొప్పులతో బాధపడుతున్న మాయను చూశారు. వెంటనే ఆమెను అదే బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి ప్రసవం జరిపారు. మాయ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రైలు డ్రైవర్‌కు కొందరు చెప్పగా, రైలును ఆలేరు లో నిలిపివేశారు. అప్పటికే 108 వాహనాని కి సమాచారం అందించగా, వారు స్టేషన్‌కు వచ్చారు. తల్లీబిడ్డలను ఆలేరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ  క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement