అన్నదాతల ‘ఉరి’ సాగు! | Sakshi
Sakshi News home page

అన్నదాతల ‘ఉరి’ సాగు!

Published Tue, Oct 6 2015 2:39 AM

అన్నదాతల ‘ఉరి’ సాగు! - Sakshi

- 11 మంది రైతుల ఆత్మహత్య
- వరంగల్ జిల్లాలో ముగ్గురు.. మెదక్ జిల్లాలో ఇద్దరు
 
 సాక్షి నెట్‌వర్క్: ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే.. అప్పులే తప్ప అవి తీరే మార్గం కనిపించక రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఏటా సాగు నష్టాలు పెరగడం.. అప్పు పెరుగుతుండడంతో దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు వేర్వేరు చోట్ల మొత్తం పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం లక్ష్మీపురంలో ఓ రైతు విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారు దాసుతండాకు చెందిన మహిళా రైతు గుగులోతు అచ్చమ్మ (35) తనకున్న ఎకరంన్నర భూమిలో పత్తిసాగుచేసింది.
 
 వర్షాభావం కారణంగా దిగుబడి వచ్చే అవ కాశం కనిపించలేదు. సాగు కోసం చేసిన రూ. 2 లక్షల అప్పు ఎలాతీర్చాలని మదనపడి ఆదివారం క్రిమిసంహారక మందుతాగింది. ఇదే జిల్లా గూడూరు మండలం గాజుల గట్టు గ్రామానికి చెందిన గంధసిరి రవీందర్‌గౌడ్(30) తనకున్న రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాగు కోసం చేసిన రూ. 4 లక్షల అప్పు ఏలా తీర్చాలని మనోవేదనకు గురయ్యాడు. సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన రైతు సుఖేందర్‌రెడ్డి(29) తనకున్న ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా నష్టాలే మిగిలాయి.
 
 ఈసారీ అదే పరిస్థితి ఎదురుకావడంతో మనోవేదనకు గురయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో ఆది వారం సాయంత్రం క్రిమిసంహారక మందు తాగాడు. హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్య లో చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లికి చెందిన రైతు జంగం స్వామి(38) ఆరేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా గంభీరావుపేట నుంచి అత్తవారి ఇల్లరుున రత్నగిరిపల్లికి వలస వచ్చా డు. బావమరిది లచ్చయ్యతో కలిసి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరి స్థితుల్లో పంటలు పండక అప్పులు పెరిగారుు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం క్రిమిసంహా రక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సీతారుుపేట్ పరిధిలోని చత్రుతండాకు చెందిన సబావత్ రాజు(32) తనకున్న మూడెకరాల్లో సోయూ వేశాడు.
 
  గతంలో ఆ భూమిలో నాలుగు బోర్లు వేసినా సరిగా నీరు పడలే దు. అప్పులు పెరగడంతో ఏడాది క్రితం గల్ఫ్‌కు వెళా ్లడు. అక్కడా సరైన పనిలేక తిరిగొచ్చాడు. పంటలు సరిగా పండక అప్పు రూ.5 లక్షలకు చేరింది. సోమవారం ఉరి వేసుకున్నాడు. మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవెళ్ళి గ్రామానికి చెందిన నాయిని బాలరాజు(30)కు 30 గుంటల భూమి ఉండగా, 8 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. సుమారు రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. పత్తికి వింత తెగులు సోకడంతో పంటతా కుళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన బాలరాజు సోమవారం ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా వెల్దుర్తి మండలం బం డపోసానిపల్లికి చెందిన అంజయ్య (58) తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఏడాదిన్నర క్రితం అ ప్పు చేసి వరుసగా మూడు బోర్లు తవ్వించాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం వేసిన పంట చేతికి వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. రూ. 2 లక్షల మేర అప్పులుండగా, తీర్చే మార్గం కనిపిం చక సోమవారం ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన మేడబోయిన అయిలయ్య(60) తనకున్న ఆరు ఎకరాల్లో వరి వేశాడు. రెండేళ్ల క్రితం బోర్లు వేసేందుకు రూ. 3 లక్షలు అప్పు చేశాడు. నీరు సరిగా పడకపోవడంతో గత ఖరీఫ్‌లో 20 గుంటలే సాగు చేశాడు. అప్పుల వారి ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉరి వేసుకున్నాడు.  రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జనవాడకు చెందిన కుమ్మరి అశోక్ (33)కు 27 గుంటల భూమి ఉండగా, 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వ ర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండుముఖం పట్టా యి. ఇటీవల రూ. లక్షతో బోరు వేయించినా నీళ్లు రాలేదు. పెట్టుబడి రూ. 2 లక్షలు అప్పులు చేశాడు. పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదని భావించి సోమవారం ఉదయం ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగ ర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లికి చెంది న మహిళా రైతు చెన్నమ్మ(50)- పెంటయ్య దంపతులు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.  వర్షాభావ పరిస్థితులు, ఎర్రతెగులు కారణంగా పంట పూర్తిగా పాడయ్యింది. మనస్తాపం చెంది ఆదివారం క్రిమిసంహారక మందు తాగి మరణించింది.
 
 కరెంటు తీగలు పట్టుకొని...
 వరంగల్ జిల్లా రేగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు దానం పుల్లయ్య(68) తనకున్న ఎకరంన్నరతో పాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా పంటలు పండక అప్పుల పాలయ్యాడు. సోమవారం గ్రామంలో రైతు భరోసా సభ నిర్వహించారు. సభకు హాజరైన పుల్లయ్య తనకున్న రూ. 4 లక్షల అప్పు వివరాలు అధికారులకు వివరించాడు. ఆదుకోవాలని అధికారుల కాళ్లావేళ్లా బతిమిలాడాడు. అధికారులు ఆదుకుంటామని భరోసా ఇచ్చినప్పటికీ అప్పులను గుర్తు చేసుకుంటూ మనోవేదనకు గురయ్యాడు. గ్రామ సభ అనంతరం పొలం వదద కరెంటు మోటారు తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement