డైటింగ్‌లో గజలక్ష్మి | Sakshi
Sakshi News home page

డైటింగ్‌లో గజలక్ష్మి

Published Wed, Aug 24 2016 6:21 PM

డైటింగ్‌లో గజలక్ష్మి

 ద్వారకాతిరుమల : సుమారు నాలుగున్నర టన్నుల బరువున్న శ్రీవారి దేవస్థానం ఏనుగు(గజలక్ష్మి) డాక్టర్ల సలహాపై డైటింగ్‌ ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితం గజలక్ష్మికి అన్నంతో పాటు అరటిపండ్లును ఆహారంగా అందించేవారు. అయితే అప్పట్లో అది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్సనందించిన వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. ఆహారం అందించే విషయంలో కూడా మార్పులు చేయాలని అధికారులకు వివరించారు. దీంతో గజలక్ష్మికి కొబ్బరి మట్టలు, మర్రి, రావి, జువ్వి ఆకులతో పాటు పచ్చగడ్డి, ఎండుగడ్డిని అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండేసి గంటలు చొప్పున శేషాచలకొండపైన, ఘాట్‌ రోడ్డులోను వాకింగ్‌ చేయిస్తున్నారు. ఈ డైటింగ్, వాకింగ్‌లతో గజలక్ష్మి ఇప్పుడు కాస్త స్లిమ్‌ అవ్వడంతో పాటు, పూర్తి ఆరోగ్యంగా ఉంటోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వాకింగ్‌ అనంతరం గజలక్ష్మి ఫ్రెష్‌గా స్నానం చేసి భక్తులకు తన సేవలందిస్తోంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement