ఉద్యోగుల ఐడియాలతో 50 కోట్ల డాలర్లు! | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఐడియాలతో 50 కోట్ల డాలర్లు!

Published Mon, Sep 15 2014 1:02 AM

ఉద్యోగుల ఐడియాలతో 50 కోట్ల డాలర్లు!

 న్యూఢిల్లీ: ఉద్యోగుల నుంచి వినూత్న ఐడియాలను ఆహ్వానించడం ద్వారా తమ కస్టమర్లకు సుమారు 50 కోట్ల డాలర్ల (రూ. 3000 కోట్లు) విలువైన సొల్యూషన్లను అందించగలిగామని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పేర్కొంది. ఐడియాప్రెన్యూర్‌షిప్‌పై దృష్టిసారించిన హెచ్‌సీఎల్ టెక్ 2008 నుంచి సుమారు 32 వేలకు పైగా వినూత్న ఐడియాలను తమ సిబ్బంది నుంచి వెలికితీయడం గమనార్హం. ‘ఒక నిర్మాణాత్మక పద్దతిలో మా ఉద్యోగులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, మరింత పదును పెట్టడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం.

కింది స్థాయి నుంచీ వినూత్న ఐడియాలను ఆకర్షించడం అనేది సరికొత్త విప్లవం. మా కంపెనీ వ్యూహంలో చాలా కీలకంగా మారింది’ అని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పృథ్వి షెర్గిల్ పేర్కొన్నారు. 2005లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ ఫస్ట్.. కస్టమర్స్ సెంకండ్(ఈఎఫ్‌సీఎస్) అనే కొత్త మేనేజ్‌మెంట్ విధానంతో ఉద్యోగుల్లో దాగి న వినూత్న ఆలోచనలను సరిగ్గా వినియోగించుకోగలుగుతున్నామన్నారు. ఈ విధానం ఇప్పటికే విద్యా సంస్థలు(హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ చేస్తోంది), విశ్లేషకులను ఆకర్షించిందని షెర్గిల్ చెప్పారు.

Advertisement
Advertisement