జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌కు అవార్డుల పంట | Sakshi
Sakshi News home page

జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌కు అవార్డుల పంట

Published Sun, Sep 21 2014 1:06 AM

జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌కు అవార్డుల పంట

హైదరాబాద్: అడ్వర్టైజింగ్ దిగ్గజం జేడబ్ల్యూటీ మైండ్‌సెట్ తాజాగా యాడెక్స్-2013లో ‘ది ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్’సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. అవార్డులు దక్కిం చుకున్న కేటగిరీల్లో బెస్ట్ కంటిన్యూయింగ్ క్యాంపెయన్ ఆఫ్ ది ఇయర్ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రకటనలకు సంబంధించి).. ఆర్ట్ డెరైక్టర్ ఆఫ్ ది ఇయర్ (చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించి).. కాపీరైటర్ ఆఫ్ ది ఇయర్ (ఏపీ టూరిజంకు సంబంధించి) ఉన్నాయి.  

జేడబ్ల్యూటీ మైండ్‌సెట్- 8 బంగారం,4 వెండి పురస్కారాలతో పాటు ది ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్ సహా మొత్తం 13 పురస్కారాలు  దక్కించుకుంది. పురస్కారాలను గెలుచుకున్న ఇతర బ్రాండ్‌ల ప్రకటనల్లో మిన్‌టాప్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్), బొటానికా, చార్మినార్ (హెచ్‌ఐఎల్), ఓరియంట్ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, సాక్షి మీడియా స్పాన్సర్ చేసింది. హైదరాబాద్‌లోని 34 ఏజెన్సీల నుంచి ఈ ఏడాది 500 పైగా ఎంట్రీలు వచ్చాయి.

 అడ్వర్టైజింగ్ రంగ దిగ్గజం కేవీ శ్రీధర్ సారధ్యంలో పలువురు ప్రముఖులు వీటిని పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు. స్థానికంగా తమ సంస్థ అత్యుత్తమ క్రియేటివ్ ఏజెన్సీ అని ఈ పురస్కారాలతో మరోసారి నిరూపితం అయినట్లు జేడబ్ల్యూటీ మైండ్‌సెట్ మేనేజింగ్ డెరైక్టర్ రామ్ గేదెల పేర్కొన్నారు.  క్లయింట్లకు తమ సంస్థ పట్ల విశ్వాసాన్ని కూడా ఈ అవార్డులు ప్రతిబింబిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement