కార్పొరేట్‌ మేలు కోసమే స్కూళ్ల మూత | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ మేలు కోసమే స్కూళ్ల మూత

Published Thu, May 25 2017 12:46 AM

కార్పొరేట్‌ మేలు కోసమే స్కూళ్ల మూత - Sakshi

ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ విద్యా సంస్థలకు మేలు చేసేందుకే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ పథకం ప్రకారం 9,000 ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తూ జీవో నంబర్‌–29ని జారీ చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. విద్యార్థులు, సిబ్బంది లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ... హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాల లను ఎత్తేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు గతంలో తన తొమ్మిదేళ్ల పాలన (1995–2004)లో కూడా నష్టాల్లో ఉన్నాయని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని... సహకార డెయిరీలు, నూలుమిల్లులు, పంచదార మిల్లుల తో పాటు ఆల్విన్, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ వంటి సంస్థలను తెగనమ్మారని గుర్తుచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement