హిస్టరీని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి | Sakshi
Sakshi News home page

హిస్టరీని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి

Published Sat, Nov 1 2014 11:47 AM

హిస్టరీని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి - Sakshi

హిస్టరీ అన్నది ఎంత అవసరమో చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఆయన ఏమన్నారంటే..

''రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందరో త్యాగాలు చేయడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అప్పటినుంచి ఇప్పటివరకు నవంబర్ 1 అనే తేదీ ఎప్పుడొచ్చినా ఎందరో త్యాగమూర్తులు గుర్తుకొస్తారు. వాళ్ల త్యాగాలు గుర్తుకొస్తాయి. తెలుగువాళ్లు ఎక్కడున్నా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన విషయం గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది. తెలంగాణ మాత్రమే జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దానికి జూన్ 2 అవతరణ దినోత్సవం అంటే అర్థం ఉంది. కానీ, ఆరోజే ఆంధ్రప్రదేశ్ అవతరించింది అనడం అర్థరహితం. మధ్యప్రదేశ్, బీహార్, యూపీ రాష్ట్రాలలో ఎవరూ అవి ఏర్పడిన తేదీలను మార్చలేదు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు.

హిస్టరీ అనవసరమైన సబ్జెక్టని చంద్రబాబు అంటూ ఉంటారు. కానీ హిస్టరీ అన్నది ఎంత అవసరమో ఆయన ఇప్పటికైనీ గమనిస్తే త్యాగాలు చేసినవారిని గుర్తించినట్లు అవుతుంది. చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యాన్ని గుర్తించాలి. లేదంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తాం'' అని వైఎస్ జగన్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement