తుళ్లూరు రైతులకు సన్మానం | Sakshi
Sakshi News home page

తుళ్లూరు రైతులకు సన్మానం

Published Wed, Mar 4 2015 6:04 PM

will ask prime minister about budget injustice, says ap cabinet

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అదనపు కేటాయింపులు కోరాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల ద్వారా సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారు. తరచు బడ్జెట్ అంశాలపై ప్రజల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు.

కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు...

  • తుళ్లూరులో రైతులకు సన్మానం
  • 21న తుళ్లూరులో ఉగాది సంబరాలు
  • రుణమాఫీ రెండోవిడత చెల్లింపులు వాయిదా
  • ఇకమీదట పీపీపీ మోడల్లో ఎక్కువ పథకాల అమలు
  • పింఛన్ల విధానంలో మార్పులు
  • పశుగణాభివృద్ధిపై దృష్టి, రైతుమిత్ర సమర్థ అమలు
  • రాష్ట్రంలో సొంతవనరులు పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి
  • కరువు, తాగునీటి ఎద్దడిపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
  • ఉద్యోగులకు 80 రోజుల సమైక్యాంధ్ర ఉద్యమ కాలాన్ని సెలవుగా మంజూరు చేయాలని నిర్ణయం
  • జిల్లాల్లో భూముల కేటాయింపులపై కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని నిర్ణయం
  • కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం.

Advertisement

తప్పక చదవండి

Advertisement