1956కు ముందు కేసీఆర్ కూడా లేరు | Sakshi
Sakshi News home page

1956కు ముందు కేసీఆర్ కూడా లేరు

Published Sat, Jul 26 2014 8:27 AM

1956కు ముందు కేసీఆర్ కూడా లేరు - Sakshi

ఏలూరు : రాజ్యాంగం ప్రకారం ఏడేళ్లపాటు ఒకేచోట విద్యాభ్యాసం చేసినవారికి స్థానికులుగా గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనుకోవటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

1956కు ముందు తెలంగాణలో ఉన్నవాళ్లనే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ చెబుతున్నా... అవేమీ సాగవని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటకొస్తే 1956కు ముందు తెలంగాణలో కేసీఆర్ కూడా లేరన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చినరాజప్ప పైవిధంగా స్పందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement