రుణమాఫీపై కేబినెట్ లో చర్చించలేదు: పల్లె | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై కేబినెట్ లో చర్చించలేదు: పల్లె

Published Fri, Aug 1 2014 8:09 PM

రుణమాఫీపై కేబినెట్ లో చర్చించలేదు: పల్లె

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.  
సమావేశమనంతరం ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మాట్లాడుతూ.. కేబినెట్ లో రుణమాఫీ అంశం, 1956 వివాదం చర్చకు రాలేదు అని తెలిపారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కొన్ని కీలక అంశాలు:
  • సమైక్యాంధ్ర కేసులన్నీ ఎత్తివేత
  • నూతన ఐటీ పాలసీకి కేబినెట్ ఆమోదం 
  • కాపులను బీసీల్లో చేర్చేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు
  • ఎన్టీఆర్ క్యాంటీన్ల పథకం అమలుకు క్యాబినెట్ సబ్‌ కమిటీ 
  • నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల బదిలీలు 
  • నూతన ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం 
  • మహిళాసంఘాలు, ఏపీఎండీసీ భాగస్వామ్యంలో ఇసుక తవ్వకాలు 
  • 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆమోదం 
  • అనంత, చిత్తూరు జిల్లాల్లో సోలార్ ప్రాజెక్ట్‌లకు భూములు కేటాయింపు
 

Advertisement
Advertisement