కార్యకర్తలకు అండగా ఉంటా | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటా

Published Tue, Jun 24 2014 2:08 AM

కార్యకర్తలకు అండగా ఉంటా - Sakshi

వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి

 
 గుంతకల్లుటౌన్: పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే నాలుగేళ్లు తన వెంట ఉన్న వారికి న్యాయం చేయాలని భావించానని, అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నారు. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓటమిపాలైందన్నారు. అంతేగాకుండా టీడీపీ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పటినుంచి తాను కూడ కార్యకర్తల్లో ఒకడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడతానని, అధికారపార్టీ చేసే తప్పులపై ప్రజల తరఫున పోరాడతానన్నారు. కార్యకర్తలు కూడ అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, మైనుద్దీన్, పట్టణ క న్వీనర్లు సుధాకర్, ఎద్దుల శంకర్, నాయకులు జింకల రామాంజనేయులు, గోపా జగదీష్, ఫ్లయింగ్ మాబు, మల్లికార్జున శాస్త్రి, త్యాగరాజు, బావన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement