రూ.30 లక్షల నోట్లు కాలిపోయాయి | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల నోట్లు కాలిపోయాయి

Published Wed, Jul 1 2015 9:21 AM

రూ.30 లక్షల నోట్లు కాలిపోయాయి - Sakshi

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షల నగదు కాలిపోయింది. 10 కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు బూడిదయ్యాయి. స్టోర్ రూంలో విద్యుత్ షార్‌‌ట సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

బోస్‌రోడ్డులోని ఈ బ్యాంకులో ఉదయం 11 గంటల సమయంలో స్టోర్ రూం నుంచి మంటలు, పొగ వచ్చాయి. దీంతో సిబ్బంది ఖాతాదారులు బయటకు పరుగులు తీశారు. బ్యాంకు మేనేజర్ జి.శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం గోడ పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ స్టాంగ్ రూమ్‌లోకివెళ్లి పరిశీలించారు. లాకర్లు భద్రంగానే ఉన్నాయని ఖాతాదారులకు ఎటువంటి నష్టంలేదని ప్రకటించారు.

స్థానిక పండరీపురం బ్రాంచిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంకు డీజీఎం గిరీష్‌కుమార్  మాట్లాడుతూ రైతుల పాసుపుస్తకాలు, తనఖా పెట్టిన బంగారానికి ఎటువంటి భయం లేదని తెలిపారు. లాకర్లను గురువారం ఉదయానికి పండరీపురం శాఖకు చేరుస్తామని, ఖాతాదారులు పరిశీలించుకోవచ్చని చెప్పారు.  ప్రమాదంలో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల నగదు కాలిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు.

Advertisement
Advertisement