ప్రజలకు అండగా ...పార్టీ పటిష్టతే లక్ష్యంగా | Sakshi
Sakshi News home page

ప్రజలకు అండగా ...పార్టీ పటిష్టతే లక్ష్యంగా

Published Thu, Nov 27 2014 3:13 AM

Party tougher target

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజా సేవే లక్ష్యంగా...ప్రజలకు అండగా ఉంటూ పార్టీని మరింత పటిష్టపరచడమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అడుగులేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలు ఎండగడుతూ, సర్కార్ మోసపూరిత తీరును  ప్రజలకు వివరిస్తూ, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకెళ్తోంది. ఆ దిశగా  శ్రేణులను మరింత సమాయత్తపరిచి, ఉద్యమ స్పూర్తితో నడిచేలా  పార్టీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా నియమితులైన త్రిసభ్య కమిటీ నేడు జిల్లాకు రానుంది. ప్రభుత్వ నిర్వాకాన్ని వివరించి,  కార్యకర్తల్ని చైతన్య పరిచి, నేతల్ని సమన్వయంతో నడించే  లక్ష్యంతో  గొట్లాం సమీపంలోగల ఆర్‌కే టౌన్‌షిప్‌లో గురువారం ఉదయం 10 గంటలకు  జిల్లా విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  త్రిసభ్య కమిటీ సభ్యులైన విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతో పాటు అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు దశ,దిశ నిర్ధేశించనున్నారు.
 
   సమావేశం వేదికైన ఆర్‌కే టౌన్ షిప్ ప్రాంగణాన్ని   బుధవారం సాయంత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సమావేశంలో ప్రధానంగా పార్టీని మరింత పటిష్టపరచడానికి తీసుకోవల్సిన చర్యలు గురించి చర్చించనున్నట్టు తెలిపారు. రెండు నెలల క్రితం జిల్లా విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించామని, అదే తరహాలో గురువారం జరిగే పార్టీ సమావేశానికి  శాసన సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితర నేతలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 5న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రాల్లో  నిర్వహించిన ధర్నాలు విజయవంతమయ్యాయని, డిసెంబర్ 5న   కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా కూడా విజయవంతం చేస్తామన్నారు.  మహాధర్నాకు 10వేల మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు హాజరవుతారన్నారు.
 
 చరిత్రలో లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను  మూటగట్టుకుందన్నారు. ఎన్నికల వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక ప్రజల్ని మభ్యపెట్టే చర్యలకు ప్రభుత్వం దిగుతోందన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించి వారి తరఫున మాట్లాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అసెంబ్లీ లోపల, బయట పార్టీ సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో చాలావరకు మండల కమిటీ సమావేశాలు పూర్తయ్యాయని. త్వరలోనే మండల, అనుబంధ సంఘాల కొత్త కమిటీలు వేయన్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంబళ్ల శ్రీరాములనాయుడు,అవనాపు విక్రమ్, మామిడి అప్పలనాయుడు,  పీరుబండి జైహింద్‌కుమార్ తదితరు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement