ఏప్రిల్ 12న ‘సాక్షి’ మాక్ ఎంసెట్ | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 12న ‘సాక్షి’ మాక్ ఎంసెట్

Published Sat, Mar 28 2015 1:05 AM

ఏప్రిల్ 12న ‘సాక్షి’ మాక్ ఎంసెట్

టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతి
ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిపుణుల ఆధ్వర్యంలో {పశ్నపత్రాల తయారీ
 

హన్మకొండ : ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను పరీక్షకు ముందు సన్నద్ధం చేసే లక్ష్యంతో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘సాక్షి’ మీడియా గ్రూప్ మాక్ ఎంసెట్-2015 టెస్ట్ నిర్వహిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ రెండో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మాక్ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ఫారం వెల రూ.75. ఫారాన్ని నింపడంతోపాటు విద్యార్థులు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అందించి, అక్కడికక్కడే హాల్‌టికెట్‌ను పొందవచ్చు.  ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మెడికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో మాక్  ఎంపెట్-2015 పరీక్ష జరుగుతుంది. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఎస్‌ఆర్ నేషనల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో రాష్ట్రస్థాయిలో టాప్ టెన్‌లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తారు.

నిపుణులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ పరీక్ష పత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరవడం ద్వారా విద్యార్థులు తమ యధార్థ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎంసెట్ పరీక్షకు హాజరుకావచ్చు. రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తోన్న ఈ మాక్ ఎంసెట్ టెస్ట్ 2015కు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (ఎస్వీ సెట్), చిత్తూరు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తోంది. మాక్ ఎంసెట్-2015కు సంబంధించి మరిన్ని వివరాలకు 99516 02875 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement