హైదరాబాద్: మాయమాటలు చెప్పి ఎన్ఆర్ఐను పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆమె కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ కామాంధుడిని చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ వై.మోహన్ కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రబ్బ రవివర్మ (45) రామంతాపూర్‌లోని దూరదర్శన్కాలనీలో భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు.
గతంలో ఇతను ఓ న్యూస్ మ్యాగ్జైన్కు క్రైం రిపోర్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో విశాఖపట్నానికి చెందిన ఉమామహేశ్వరితో పరిచయమై ఫోన్, ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుకొనేవారు. తనకు ఓ ప్రాజెక్ట్ వచ్చిందని, దాన్ని పూర్తి చేస్తే రూ.500 కోట్లు వస్తాయని, ఇందుకు తనకు కొంత డబ్బు కావాలని మహేశ్వరితో అన్నాడు. ఆమె యూఎస్‌లో ఉంటున్న తన మిత్రురాలు రాగలక్ష్మికి విషయం చెప్పి, ఇద్దరిని చాటింగ్ ద్వారా కలిపింది.
భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలతో యూఎస్‌లో ఉంటున్న రాగలక్ష్మి.. రవివర్మ మాటలు నమ్మి 50 వేల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 23 లక్షలు) పంపింది. ఈ క్రమంలో తర చూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. 2013లో పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన రాగలక్ష్మిని అతను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకొని కొన్నిరోజులున్నారు. రాగలక్ష్మి తన కుమార్తె(14)ను నగరంలోని సోదరి నాగదేవి ఇంటి వద్ద ఉంచి, కొడుకును తీసుకొని యూఎస్ వెళ్లిపోయింది. రవివర్మ తరచూ నాగదేవి ఇంటికి వెళ్లి.. వరుసకు కుమార్తె అయిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ఈ ఏడాది జూన్‌లో నగరానికి వచ్చిన రాగలక్ష్మి, రవివర్మ పిల్లలతో కలిసి నేపాల్ వెళ్లింది. అక్కడ రవివర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది. నేపాల్ నుంచి వచ్చి కుమార్తెను సీతాఫల్మండి మేడిబావిలోని మరోసోదరి స్నేహదేవి ఇంట్లో ఉంచి యూఎస్ వెళ్లిపోయింది.
జూలై 27న స్నేహదేవి ఇంటికి వచ్చిన రవివర్మ బాలికను లైంగికంగా వేధించసాగాడు. ఎవరికైనా చెబితే పాస్‌పోర్టు చింపేస్తానని, తల్లిని కలవకుండా చేస్తానని బెదిరించాడు. బాలిక విషయాన్ని పిన్ని స్నేహదేవికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం రవివర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
క్రైం రిపోర్టర్ వెకిలి చేష్టలు
Published Fri, Aug 1 2014 10:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement