రుణ మాఫీకి కార్పొరేషన్..! | Sakshi
Sakshi News home page

రుణ మాఫీకి కార్పొరేషన్..!

Published Tue, Sep 16 2014 2:40 AM

Corporation for Farmer Loan Waiver

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చర్చ  
 మాఫీ మరింత జాప్యం చేయడానికే అనే విమర్శలు
 
 సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీపై కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రుణ మాఫీకి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అరుుతే తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. కార్పొరేషన్ ద్వారా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలకు నిర్ణీత మొత్తానికి బాండ్లు జారీ చేస్తారు. రైతులు బ్యాంకులకు బకాయిపడ్డ మొత్తాన్ని ముందుగా వారే చెల్లించేయూలి. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లను కాలపరిమితి ముగిశాక కార్పొరేషన్‌కు సమర్పించి సదరు మొత్తాన్ని తిరిగి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై, కార్పొరేషన్‌కు తగిన నిధులను సమకూర్చే అంశంపై కేబినెట్ చర్చించింది. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని, వ్యాట్ వాటా కింద కేంద్రం నుంచి వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని ఈ కార్పొరేషన్‌కు మళ్లించనున్నారు. ఏపీఐఐసీ భూములను తాకట్టు పెట్టి వచ్చే మొత్తాన్ని, ఇతరత్రా ఆదాయాలను కూడా ఈ కార్పొరేషన్‌కు పెట్టుబడిగా మళ్లించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు చెప్పారు. కార్పొరేషన్ జారీ చేసే బాండ్లకు దశలవారీగా చెల్లింపులు చేస్తామని తెలిపారు. రైతులకు నేరుగా రుణమాఫీ చేయకుండా.. విధి విధానాల రూపకల్పనకు, అవసరమైన నిధుల సమీకరణ తగు సూచనలు చేయడానికంటూ తొలుత నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నిధుల సమీకరణకు అంటూ ఎంపీ సుజనా చౌదరి నాయకత్వంలో మరో కమిటీని నియమించింది. ఇలా కమిటీల మీద కమిటీలు నియమిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా కార్పొరేషన్‌ను తెరపైకి తీసుకురావడం.. మాఫీని మరింత జాప్యం చేయడానికేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రాష్ట్రంలో అన్ని విభాగాలను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు పూర్తిస్థాయిలో సహకరించకపోవడంపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 చిత్తూరు వద్ద ‘హీరో’ ప్లాంటు
 ఏపీలో తమ పరిశ్రమను ఏర్పాటు చేయాలని  మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో’ నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సమీపంలో ఈ కంపెనీ తన ప్రాజెక్టును నెలకొల్పనుంది. సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం వెల్లడించారు. 
 

Advertisement
Advertisement