‘చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజికి చేరింది’ | Sakshi
Sakshi News home page

నిన్నటివరకూ శిల్పా మోహన్‌ రెడ్డి మంచోడు..

Published Mon, Aug 21 2017 10:52 AM

‘చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజికి చేరింది’ - Sakshi

ఓటమి భయంతోనే శిల్పా మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు
నిన్నటివరకూ శిల్పా మోహన్‌ రెడ్డి మంచోడు..
చంద్రబాబు నైజం ఎలాంటిదో ఎన్టీఆరే చెప్పారు


నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజికి చేరిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అందుకే ఓటమి భయంతో శిల్పా మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ...‘ నిన్నటివరకూ శిల్పా మోహన్‌ రెడ్డి మంచోడు. టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరగానే విమర్శలు.

గతంలో భూమా నాగిరెడ్డిని విషవృక్షం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే భూమాను పొగుడుతున్నారు. మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్‌ను ఇలానే విమర్శించారు. మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. మైనార్టీలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారు.

చంద్రబాబు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘటన వైఎస్‌ఆర్‌దే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించిన ఏకైక సీఎం వైఎస్‌ఆర్‌. సాయం చేసిన వైఎస్‌ఆర్‌ను మైనార్టీలు ఎప్పటికీ మరిచిపోరు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. తన అవినీతి పాలనకు ఓట్లు రావు కాబట్టే..నంద్యాలలో రూ.కోట్లు పంపిణి చేసి కొనాలనుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement