వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు | Sakshi
Sakshi News home page

వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు

Published Wed, Apr 22 2015 3:15 AM

8th class students strike at school

బి.కొత్తకోట: అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బి.కొత్తకోట ఆదర్శ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్‌చంద్రకుమార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం 8వ తరగతి విద్యార్థినీవిద్యార్థులు మూ డు గంటలపాటు ధర్నా నిర్వహించారు. వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్న ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నినాదా లు చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, డీఈవో సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని ప్రకటించారు.

వివరాల్లోకి వెళ్తే... కొంతకాలంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్ వేధిస్తున్నారంటూ 21 ఆరోపణలతో కూడిన ఫిర్యాదును 81 మం ది విద్యార్థినీ విద్యార్థుల సంతకాలతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఈ వో ధనరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. కిరణ్ తమను ఏరకంగా వేధిస్తున్నారో సవివరంగా చెప్పుకొన్నారు. దీనిపై చర్యలు తీసుకొవాలనీ, లేకుంటే రాత్రంతా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ కార్యాలయంలోనే బైఠాయించారు.

కొంతసేపటి తర్వాత కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవోల దృష్టికి వెళ్లడంతో వారు స్పం దించారు. డీఈవో ఎంఈవోతో ఫోన్లో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను తెలుసుకొన్నారు. దీనిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ కూడా ఆరా తీసి వివరాలు తెలుసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇస్తామని ఎంఈవో చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే శంకర్‌కు ఫిర్యాదు చేశారు.
 
‘గాడిదలకు పుట్టారా’
తరగతి గదిలో పాఠాలు చేప్పే కిరణ్ చాలా అసభ్యకరమైన పదాలు వాడు తూ తిడుతుంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గాడిదలకు పుట్టారా లేక కంచర గాడిదకు, అడ్డ గాడిదలకు పుట్టారా అంటూ అవహేళనగా మాట్లాడుతారని చెప్పారు. 12 పీరియడ్లకు సరిపోయే సిలబస్‌ను అరగంటలో ముగించి.. డౌట్లు అడిగితే ‘డౌట్లు కడి గేసుకోండి’ అంటూ హేళన గా మాట్లాడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కంప్యూటర్ పాఠాలు నే ర్చుకునే వీలులేకుండా గదిలోకి వెళ్లనివ్వడంలేదని చెప్పారు. మీరిప్పుడు 8,  9లోకి రండి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ బెదిరిం చారని వాపోయారు. ఒకరోజు ఆల స్యంగా వస్తే వారం రోజులు గైర్హాజరు వేస్తూ, చాలాసార్లు కొట్టారని ఈ వేధింపుల నుంచి కాపాడమంటూ వేడుకొన్నారు.
 
‘పనిలేక వచ్చుంటారులే’
ఈ విషయంపై ఫోన్లో ప్రిన్సిపాల్ కిరణ్ వివరణ కోరగా వాళ్లు పనిలేక ధర్నాకు వచ్చుంటారులే.. ఇదంతా మామూలేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేధిస్తున్నారన్న విషయంపై వివరణ ఇవ్వలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement