-
బంగారం స్పీడ్‌కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. మూడు రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలిగించాయి.హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తగ్గి రూ. 72,270 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 దిగొచ్చి రూ.72,420 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 క్షీణించి రూ.72,270 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,270 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,330 లకు దిగొచ్చింది. -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి. -
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీటైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది. -
సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement