మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు | Sakshi
Sakshi News home page

మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు

Published Fri, May 3 2024 8:54 PM

Special article over chandrababu Propaganda of lies

అబద్ధాలు ప్రచారం... ఉత్తుత్తి గాలి కబుర్లు

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.

టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.

ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.

తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..

వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...

దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.

మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.
-- సిమ్మాదిరప్పన్న
 

Advertisement
 
Advertisement