పేదలపై చంద్రబాబు కూటమి మరో కుట్ర | Sakshi
Sakshi News home page

పేదలపై చంద్రబాబు కూటమి మరో కుట్ర

Published Fri, May 3 2024 8:30 PM

Chandrababu Alliance Against The Poor Is Another Conspiracy

సాక్షి, విజయవాడ: పేదల పథకాలపై చంద్రబాబు కూటమి మరో కుట్రకు తెరలేపింది. పేదలకు పథకాలు అందకుండా పరోక్ష ఫిర్యాదులు చేస్తోంది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపులను కూటమి అడ్డుకుంటోంది.  డీబీటీ చివరి దశ చెల్లింపులకు మోకాలడ్డుతోంది.

డీబీటీ చివరి దశ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమతి కోసం ఇప్పటికే ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతి ఇవ్వకుండా ఈసీపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

పెన్షన్లు అడ్డుకున్న తరహాలోనే పథకాల అమలును టీడీపీ కూటమి అడ్డుకుంటోంది. బీజేపీతో టీడీపీ పొత్తు తర్వాత పరిస్థితులు మారాయి. లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అమల్లో ఉన్న పథకాలకు కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. లబ్ధిదారుల ఇబ్బందులను ప్రభుత్వం ఈసీ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. వెంటనే అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

Advertisement
Advertisement