-
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
-
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
-
జూన్ 4న జగన్ ప్రభంజనం..
-
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
-
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
-
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
-
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
-
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. -
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.చంద్రబాబు డైరెక్షన్లోనే..: విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులుటీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. -
ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్
-
చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది
-
దేశ రాజకీయ చరిత్రలోనే YSRCP సరికొత్త చరిత్ర..
-
సీఎం జగన్ ధీమా..వైఎస్ఆర్ సీపీలో ఫుల్ జోష్
-
ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా ఉండే విశాఖలో ఎప్పుడు ఏదో ఒక అలజడి రేపాలని ఎల్లో బ్యాచ్ కుట్రలు చేస్తూనే ఉంటుంది. తాజాగా కంచర్లపాలెం పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది.కుటుంబ కలహాలను పోలింగ్ ఘర్షణలకు లింకు పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారు. పరామర్శ ప్రక్రియ పూర్తయ్యాక.. మభ్య పెట్టే మాటలు చెప్పి.. ఎల్లో మీడియాలో గొడవకు సంబంధించి కట్టుకథను వండివర్చారు. దీనికి మసాలా యాడ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీకి ఓటు వేసినందుకు హింసిస్తున్నారంటూ.. తన నక్క తెలివి తేటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కల్పిత కథనాలను పదేపదే ప్రచారం చేస్తూ విశాఖలో ఏదో జరిగిపోయిందంటూ గగ్గొలు పెట్టింది ఎల్లో మీడియా. వారికి సోషల్ మీడియాలో పచ్చబ్యాచ్ కూడా తోడైంది. టీడీపీ నీచ రాజకీయాలను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో మరోసారి ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా పడింది.అసలు జరిగింది ఇదే..కంచరపాలెం పరిధిలో బుధవారం రాత్రి ఓ కుటుంబంపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవల వల్లే తప్ప.. రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్తిబాబు తెలిపారు. ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక బర్మా క్యాంప్, నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం(నిరీష) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో ఆశ కుటుంబంతో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు ఆశ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న ఆశ బంధువైన లోకేష్‌కు విషయం తెలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న నూకరత్నం, ఆమె తల్లి ధనలక్ష్మి, కుమారుడు మణికంఠపై కర్రతో దాడి చేశాడు. గాయాలపాలైన వారంతా కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. లోకేష్‌ను రిమాండ్‌కి తరలించారు.టీడీపీ నేతలు తప్పుడు ప్రచారంరెండు కుటుంబాల మధ్య వివాదానికి టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేయలేదని ఆ నేతలే దాడి చేశారని పరామర్శ పేరుతో బాధితుల ఇంటికి వెళ్లి డ్రామాలు చేశారు. బాధితులతో ఆ విషయం చెప్పించారు. వాస్తవంగా పాత గొడవలు నేపథ్యంలోనే తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ దాడి అంటూ టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. -
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
-
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
-
జూన్ 09..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్సీపీ లీగల్ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. -
రికార్డు బ్రేక్ అయ్యేలా ఈసారి ఎన్నికల ఫలితాలు
-
చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..
సాక్షి, అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు చంద్రబాబే కారణమని, ఆయన ప్రోద్బలంతోనే హింసాకాండ కొనసాగిందని మంత్రి బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ పలుచోట్ల పోలీసు అధికారులను మార్పులు చేసిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక çఘటనలు పెరిగాయని వివరించింది.పోలీసు అధికారులు తీసుకున్న చర్యల్లోని లోపాలనూ ఫిర్యాదులో ప్రస్తావించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించారని తెలిపింది. మిశ్రా టీడీపీతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీస్తూ తనకు అప్పగించిన బాధ్యతకు తూట్లు పొడిచారని చెప్పారు.హింస ఆందోళన కలిగిస్తోంది..చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందన్నారు. టీడీపీ ఫిర్యాదులపై విచారణ లేకుండా ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా చర్యలు తీసుకోవడం ఆయన పక్షపాతంగా వ్యవహరించారనడానికి నిదర్శనమని, ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెప్పించుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు.రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు, ఆ తర్వాత పరిణామాలను గవర్నర్‌కు వివరించామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. శంఖబ్రతబాగ్చీ, త్రిపాఠి, బిందు మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మిశ్రాతో పాటు, వీరందరూ కౌంటింగ్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దీపక్ మిశ్రా వ్యవహరిస్తున్నారన్నారు.మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. ఉద్దేశ పూర్వకంగా మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీలు తెచ్చాయని చెప్పారు. అతని కారణంగానే విధ్వంసం జరుగుతోందన్నారు. మిశ్రా విజయవాడకు వచ్చినప్పటి నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు ఉన్నారు. -
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం, 2019కి మించి వైఎస్సార్సీపీ ప్రభంజనం... పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
May 17th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 17th AP Elections 2024 News Political Updates09:10 PM, May 17th, 2024విజయవాడ:ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటువినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నియామకంఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డిఎస్పీలు వి శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లుభూషణం, వెంకటరావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస పై దర్యాప్తు చేయనున్న సిట్ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తు చేయనున్న సిట్రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఆదేశం 06:41 PM, May 17th, 2024కృష్ణాజిల్లాటీడీపీ నేత బోడే ప్రసాద్ పై కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి ఫైర్కుల అహంకారంతో పోరంకిలో బోడె ప్రసాద్ దాడులకు తెగబడ్డాడుటెన్త్ క్లాసులో వేరే వాళ్ళతో పరీక్షలు రాయించుకున్నాడుకులాన్ని అడ్డుపెట్టుకుని చందాలు పోగు చేసుకున్న వ్యక్తి బోడెపోలింగ్ రోజు గోడ దూకి దౌర్జన్యంగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడుటీడీపీ రౌడీలు, గూండాలు దాడులకు పాల్పడుతున్నారువైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డాడుకానూరులో నిరాశ్రయులైన వారికి సెంటు భూమి ఇవ్వలేకపోయావ్గతంలో ఎన్టీఆర్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారుజగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు 04:16 PM, May 17th, 2024మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే: : బొత్సటార్గెట్ 175 దగ్గరకు వస్తాంఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందితొందరపాటు నియమాకాల వల్లే హింసాత్మక ఘటనలుఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలుహింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించంరాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నానుఅధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలిరాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారుమాపై నిందలు వేయడం సరికాదుహింసాకాండకు వైఎస్సార్సీపీ పూర్తి వ్యతిరేకంప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు 04:13 PM, May 17th, 2024జనసేన డీలా.. నేతల్లో కనిపించని ఉత్సాహంపోలింగ్ తర్వాత నేతలలో నిరుత్సాహంపిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....జనసేనకి దెబ్బకొట్టిన క్రాస్ ఓటింగ్ఎన్నికల తర్వాత పవన్ గప్ చుప్పోలింగ్ తర్వాత ప్యాకప్ చెప్పేసిన పవన్ఆదినుంచి పవన్ వైఖరే పార్టీకి కొంపముంచిందంటున్న నేతలుటీడీపీ కోసం సీట్లు వదులుకోవడమే పార్టీకి చేటుచేసిందనే వ్యాఖ్యలుకాపులు మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని విశ్లేషణగోదావరి జిల్లాలలోనూ ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్న నేతలుకూటమి నుంచి అందని సహకారంటీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాలేదనే అనుమానాలు 03:30 PM, May 17th, 2024విజయవాడఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటుపై సీఎస్ కసరత్తుముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలిస్తున్న ప్రభుత్వంరవి ప్రకాష్, వినీత్ బ్రిజ్ లాల్, పిహెచ్డీ రామకృష్ణలలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం.రెండు రోజుల్లోగా పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల పై నివేదిక ఇవ్వనున్న సిట్.ఎన్నికల అనంతరం హింసలో భాగస్వామ్యం అయిన పోలీస్ అధికారులు, పోలీసుపైన నివేదిక ఇవ్వనున్న సిట్.03:00 PM, May 17th, 2024తాడేపల్లి :కుట్ర ప్రకారమే అల్లర్లు జరిగాయి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదు.రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణం.అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది.చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతం?ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలి.నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారు.అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి.టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.జూన్ 4న వైఎస్ జగన్ సునామీ వస్తుంది.చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?వ్యవస్థలను మేనేజ్ చేసే కట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు.పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారు.ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటి?ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయి.02:40 PM, May 17th, 2024విజయవాడ:విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేతవైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీసీపీని కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ లీగ్ సెల్ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయివైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారుకొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుకావాలనే బైండోవర్లు పెట్టి వేధిస్తున్నారునిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి నిర్భదించారువైఎస్సార్సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి 02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్ అభ్యర్థులుజాయింట్ కలెక్టర్ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్ఎస్2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్ జగన్6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్2019కి మించి 2024లో వైఎస్సార్సీపీ ప్రభంజనంజూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం -
టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు బాధ్యత మరచి హింస చెలరేగేందుకు తావిచ్చినందుకు వేటు పడింది! నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు రాజకీయ ఒత్తిళ్లతో చెప్పినట్లలా ఆడినందుకే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుట్రలకు తలొగ్గి పచ్చ ముఠాల విధ్వంసకాండకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కన్నెర్ర చేసింది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను హఠాత్తుగా బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసాకాండ చెలరేగిన విషయాన్ని వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులను నియమించడంతో ఎన్నికల వేళ హింస చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు తోలు»ొమ్మల్లా వ్యవహరించడంతో టీడీపీ రౌడీ మూకలు బరి తెగించి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. లావు సన్నిహితుడు.. బిందు మాధవ్ ప్రజాదరణ కోల్పోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్రమాలు, హింసకు చంద్రబాబు తెర తీశారు. ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉండటం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారిపై నిరాధార ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా ఈ కుట్రలను అమలు చేశారు. పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు పోలీసు అధికారులను బదిలీ చేయాలని పేర్కొంటూ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను సమర్పించారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన ఈసీ హడావుడిగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్చార్జ్ పీఎస్ఆర్ ఆంజనేయులతోపాటు గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీని బదిలీ చేసింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకు ఆ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. సమస్యాత్మక పల్నాడు జిల్లా ఎస్పీగా గరికిపాటి బిందు మాధవ్‌ను నియమించారు. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదే రీతిలో పురందేశ్వరి సూచించిన వారినే తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నియమించారు. పూర్తిగా విఫలమైన ఈసీ నియమించిన అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన, పట్టులేని అధికారులను నియమించడంతో పోలింగ్ సందర్భంగా, అనంతరం టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయాయి. యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టించాయి. నరసరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో స్వైర విహారం చేశాయి. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికిపాటి బిందు మాధవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌లపై టీడీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడి బాంబులు విసిరినా సరే పోలీసులు పత్తా లేరు. తమపై దాడులు జరుగుతున్నాయని పల్నాడు ఎస్పీకి మొర పెట్టుకున్నా కనీస స్పందన లేదు. పోలింగ్ సక్రమంగా నిర్వహించడంలో పల్నాడు కలెక్టర్ లోతేటి శివ శంకర్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారినా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు తెగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఎస్పీ అమిత్ బర్దర్ వీటిని కట్టడి చేయలేకపోయారు. ఏకంగా పోలీసులే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించడం నివ్వెరపరిచింది. చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ అల్లరి మూకలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఏఎస్పీ వల్లే తాడిపత్రిలో అల్లర్లుటీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వైనం తాడిపత్రి రూరల్: అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తీరే తాడిపత్రిలో విధ్వంసానికి కారణమైందని పట్టణంలో చర్చ జరుగుతోంది. టీడీపీకి దన్నుగా నిలిచి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించారని స్పష్టమవుతోంది. అనంతపురంలో ‘సెబ్’ అడిషనల్ ఎస్పీగా ఉన్న రామకృష్ణను పథకం ప్రకారమే అధికారులు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలింగ్ కేంద్రాలను పరిశీలించే అనుమతి లేదని, ఆయన రాకతో అల్లర్లు చెలరేగి శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పినా, ఏఎస్పీ పెడచెవిన పెట్టారు. పైగా జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంట ఉంటూ వైఎస్సార్సీపీ నాయకులపై చిందులు తొక్కారు. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఆ సమయంలో జేసీ, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏఎస్పీ తమకు అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే జేసీ వర్గీయులు అరాచకం సృష్టించారు. ఈ విషయమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేయగానే.. ఏఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి పర్నీచర్, కంప్యూటర్లు ధ్యంసం చేయించడం, దొరికిన వారిని దొరికినట్లు చితక బాదడం చర్చనీయాంశమైంది. -
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది. -
జగన్‌కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. భారత ఎన్నికల చరిత్రను తిరగ రాయబోతున్నారు. దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు. 'జగన్ జనాలను ఎంత బలంగా నమ్మారో.. జనం కూడా జగన్‌ను అంతే బలంగా నమ్మారు'. ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే 81.6 శాతం పోలింగ్. ఇప్పటి వరకు 4 దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగ్ నమోదు కాలేదు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి, తన పాలనపై ఉన్న నమ్మకం, ప్రజల్లో విశ్వసనీయతే.. ముఖ్యమంత్రి జగన్ 151 సీట్ల మార్కును అధిగమిస్తారన్న ప్రకటనకు మూలం అని కనిపించింది.81.6 శాతం పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు పోలింగ్ బూతుల్లో పోటీ పడ్డప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. సోమవారం పోలింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచే కాక బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు శుక్రవారం నుంచే ఆంధ్రప్రదేశ్‌కు రావడం మొదలు పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 25 శాతం మంది కార్లలో వస్తే 75 శాతం మంది బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకుని ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, మధ్ యతరగతి, దిగువ మధ్య తరగతి, బీపీఎల్ ప్రజలున్నారు. హైదరాబాద్‌లో వాచ్మెన్లుగా పని చేసేవారు, తాపీ పని చేసేవారు కూడా ఆదివారానికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వీరు అత్యధికంగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు. గాంధీ జీ కలలు కన్నా స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు. అభివృద్ది అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్లు కాదని, అభివృద్ది అంటే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. గ్రామ సచివాలయాలు, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.57 నెలల్లో సీఎంగా జగన్ ఇవన్నీ చేస్తే.. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే 81. 6 శాతం ఓటింగ్. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. నాడు నేడు కింద 46 వేల ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నారు. ఒక్క విద్యా రంగానికే రూ.72 వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు 7 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే.. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన బాధ్యత అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచే నాణ్యమైన చదవు అందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పోలింగ్ సరళిలో కచ్చితంగా కనిపించింది. పేద, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు సీఎంగా మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది.కూటమిని ప్రజలు నమ్మలేదు. చంద్రబాబును అస్సలు నమ్మలేదు. పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలు మరిచిపోలేదు. 2014 ఎన్నికల్లో బాబు హామీలు తన బాధ్యతన్న పవన్ తరువాత పట్టించుకోలేదు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని కూటమి నేతలు అనుకుంటే పొరపాటు.2024లో ఏర్పడిన కూటమిని ప్రజలు నమ్మకపోవడానికి ఇవే కారణాలు. బాబు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఏపీ బీజేపీ ఇంచార్జి సిద్దార్థ్ ఇష్టంపడలేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ఏపీలో చర్చే జరగలేదు. కానీ.. జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మాత్రం IPL మ్యాచ్‌లు చూసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో జనం టీవీల ముందు కూర్చొని చూశారు. ఇది జగన్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలకు డబ్బులు పెంచిన జగన్.. మిగతా పథకాలకు పెంచకుండానే కొనసాగిస్తానన్నారు. అయినా.. ప్రజలు జగన్ వెంటే నిలబడినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు "సంపద సృష్టి" హామీలను ప్రజలు పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు కూటమి కట్టింది తమ కోసం కాదని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికే అని ప్రజలు బలంగా విశ్వసించారు.ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) నుంచి కుప్పం (చిత్తూరు) దాకా ఫ్యాన్ గాలి బలంగా వీచినట్లు కనిపించింది. అత్యధికంగా దర్శిలో 90 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో 89 శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని విశ్లేషిస్తే కుప్పంలో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. పిఠాపురంలో కూడా 85 శాతం పోలింగ్ నమోదైంది. పథకాల లబ్ధిదారులు ఓటేయ్యడం వల్లనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. అంటే.. పిఠాపురంలో కూడా పవన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి.ఇక.. మంగళగిరి, హిందూపూర్ల్లో మామ, అల్లుళ్లు గెలిస్తారా..? లేదా..? అనే దానిపై సర్వేలు రకరకాలుగా చెబుతున్నాయి. మంగళగిరిలో ఎవరు బయటపడ్డ 2, 3 వేల ఓట్ల తేడా ఉంటుందంటున్నారు. ఇక... ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్సఫర్ కాలేదు. జనసేన ఓటర్లు టీడీపీకి వేయలేదు. టీడీపీ ఓటర్లు జనసేనకు వేయలేదు. బీజేపీ ఓటర్లు ఈ రెండు పార్టీలకు వేయలేదు. కొందరు ఎంపీ స్థానాలకు వేయలేదు. బీజేపీ - జనసేన పోటీ చేసిన 30 స్థానాల్లో వైసీపీ 25 స్థానాలు తక్కువ గాకుండా గెల్చుకుంటుందని చెబుతున్నారు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే... కాపులు కీలెరిగి వాతపెట్టారు. తమను ఓటు బ్యాంకు చేసి రాజకీయాలు చేయాలనుకున్నవారికి ఓటుతో సమాధానం చెప్పారు. గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు సగానికంటే ఎక్కువ ఫ్యాన్వైపు మళ్లినట్టు సర్వేలు చెబుతున్నాయి.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు.. చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయింది. సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్ తన సత్తా చాటితే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యక్తి గత విమర్శలతో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వివేకా హత్య గురించి ఒకసారి, దీని కోసం షర్మిల, సునీతలను తీసుకొచ్చినా అనుకున్న ఫలితం చంద్రబాబుకు కనిపించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబును రాజకీయంగా బతికించలేకపోయింది. సీఎం జగన్ టీవీకి ఇచ్చిన 2 గంటల 20 నిమిషాల ఇంటర్వ్యూ చాలా మంది మేధావులు, న్యూట్రల్స్‌ను ఫ్యాన్‌కు ఓటు పడేలా చేసింది.జగన్ ఇచ్చిన క్లారిటీ మేధావులను, న్యూట్రల్ పీపుల్‌ను ఆకట్టుకుంది. సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం, ఆర్ధిక వ్యవస్థపై ఆయనకున్న పట్టు, ప్రతి అంశంపై ఆయన మాట్లాడిన తీరు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వచ్చి ఓటేసేలా చేసింది. అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో యథాలాపంగా జరిగిందని టీడీపీ నేతలే చెప్పుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ.70 వేల కోట్లు ఇస్తుంటేనే వామ్మో వాయ్యే అని గుండెలు బాదుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును ప్రశ్నించకపోవడంపై సామాన్యులు పెదవి విరిచారు. చంద్రబాబు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఏడాదికి రూ.1.67 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారన్న సీఎం జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదు.57 నెలల తన పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ది కళ్ల ముందు కనిపిస్తుంది. సంక్షేమం ప్రతి గడప తొక్కింది. జగన్‌ను ప్రజలు తమ బిడ్డ అనుకున్నారు. జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని బలంగా నమ్మారు. మహిళలైతే జగన్‌తోనే తమ పిల్లలు బంగారు భవిష్యత్తు సాధ్యమని బలంగా విశ్వసించారు. కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా జగన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. విద్యా సంస్కరణలు, గ్రామీణ సచివాలయాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడం, కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడం యువతను ఆకట్టుకున్న అంశాలుగా తెలుస్తుంది. అలానే.. జాబ్ మేళాలు కూడా యువతలో బలమైన ముద్ర వేశాయి.అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వల్లనే పోలింగ్ 80 శాతం దాటింది. పోలింగ్ సరళిని బట్టి పాజిటివ్ ఓటుగా సెఫాలజిస్ట్‌లు పరిగణిస్తున్నారు. పోలింగ్ తరువాత వెలువడిన సర్వేలు కూడా వైఎస్ఆర్ సీపీదే గెలుపని చెబుతున్నాయి.- వైవి రెడ్డి, సీనియర్ జర్నలిస్టు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణుదేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్‌డే విషెస్
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్‌వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్‌కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్‌కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement