పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జాగ్రత్తగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జాగ్రత్తగా నిర్వహించాలి

Published Sat, May 4 2024 12:25 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జాగ్రత్తగా నిర్వహించాలి

నారాయణపేట: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష.. ప్రి సెడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎరగ్రుట్ట సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలోని నారాయణపేట, మక్తల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ఓటర్స్‌ రిజిస్ట్రేషన్‌ రిజిస్టర్లను, ఓటింగ్‌ సరళిని కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడారు. శుక్రవారం నుంచి 8వ తేది వరకు నిర్వహించే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలో మొదటి అంతస్తులో నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించిన రెండు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ బూత్‌లు, రెండవ అంతస్తులో మక్తల్‌ నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. సెంటర్‌ లోపలికి సెల్‌ ఫోన్లను అనుమతించరాదని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఓ గదిలో ఏర్పాటు చేయనున్న పోస్టల్‌ బ్యాలెట్‌ల స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. గది బయట, లోపల సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఉట్కూర్‌, ధన్వాడ, మరికల్‌ తహసిల్దార్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement