దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ

Published Sun, Feb 26 2017 7:17 AM

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు. ఒక షార్ప్ షూటర్, మరో ముగ్గురిని పోలీసులు రాజ్‌కోట్ నగర శివార్లలో అరెస్టు చేశారు. దావూద్ సోదరుడు అనీస్ సూచనల మేరకు వాళ్లు ఇక్కడికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం తరఫు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునే అనీస్ ఇబ్రహీం.. జామ్‌నగర్‌ వ్యాపారవేత్తను చంపేందుకు రామ్‌దాస్ రహానే, మరో ముగ్గురికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement