అనైతిక బంధం ..వరుడిపై పెట్రోల్‌ దాడి | Sakshi
Sakshi News home page

అనైతిక బంధం ..వరుడిపై పెట్రోల్‌ దాడి

Published Sat, Feb 24 2018 10:04 AM

పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్‌ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement