ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Jun 9 2017 5:41 PM

సోషల్‌ మీడియా దురుపయోగాలపై సమాజంలోని అన్ని వర్గాలూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎన్‌.సాంబశివరావు అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో, మొబైల్‌ఫోన్లలో ఏం చూస్తున్నారో నిరంతరం కనిపెట్టాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ‘లిఖిత కిడ్నాప్‌’ కేసును ఛేదించిన సందర్భంగా, ఆ కేసులో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను డీజీపీ మీడియాకు వివరించారు. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. లిఖిత కేసు గురించి మాట్లాడేక్రమంలో డీజీపీ సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల మందికి 50 వేల మంది పోలీసులే ఉన్నారని, పోలీసులు తలుచుకుంటే ఎలాంటి కేసునైనా ఛేదించగలరుకానీ.. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘ఇటీవలి కాలంలో ఏపీలో కిడ్నాప్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.