వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్! | Sakshi
Sakshi News home page

వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!

Published Wed, Sep 14 2016 7:33 PM

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ గా పేరొందిన బఫెట్ కేవలం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయలను నష్టపోవడం మార్కెట్ వర్గాలను విస్మయపర్చింది. 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు. బఫెట్ మేజర్ పెట్టుబడులు పెట్టిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల యాజమాన్య సంస్థ ఫార్గో అండ్ కో భారీ కుంభకోణంలో ఇరుక్కుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. 65.8 బిలియన్ డాలర్ల తోప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్ వేలకోట్ల సంపద క్షణాల్లోఆవిరైపోయింది. బఫెట్ కు చెందిన బెర్కషైర్ హాత్వే ఇంక్ వెల్స్ ఫార్గో లో అత్యధిక వాటాను కలిగింది.

Advertisement
Advertisement