15న ధర్మభిక్షం శతజయంతి ముగింపు ఉత్సవాలు  | Sakshi
Sakshi News home page

15న ధర్మభిక్షం శతజయంతి ముగింపు ఉత్సవాలు 

Published Thu, Feb 10 2022 3:29 AM

Dharma Bhiksham Centenary Celebrations On 15th Feb: Chada Venkatreddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు ఉత్సవాలు ఈ నెల 15న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా కదలివచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీలోని వివిధ ప్రజా సంఘాల బాధ్యుల సమావేశం మంగళవారం రాత్రి జరిగింది.

కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్న సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... 15న రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డితో కూడిన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement