Sakshi News home page

WC 2023: ఆసియా కప్‌ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. వీలు కాకపోవడంతోనే సుందర్‌కు ఛాన్స్‌: డీకే

Published Fri, Sep 22 2023 6:23 PM

India Called Ashwin First For Asia Cup 2023 Final But: Karthik Big Revelation - Sakshi

India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్‌ సుందర్‌ను కాదని.. రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్‌-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్‌తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.

దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్‌ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్‌ సింగ్‌ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్‌ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా ఆశల పల్లకిలో
కాగా అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా చెన్నై ఆఫ్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వరల్డ్‌కప్‌-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు.

ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్‌లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్‌మెంట్‌ తీరుపై అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. 

ఆసియా కప్‌ ఫైనల్‌కు ఫస్ట్‌ ఛాయిస్‌ అశూనే
ఈ క్రమంలో.. దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్‌ పటేల్‌ స్థానంలో ఆసియా కప్‌-2023 శ్రీలంకతో ఫైనల్‌కు తొలి ఛాయిస్‌ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్‌ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. 

ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్‌, అజిత్‌, రాహుల్‌ ద్రవిడ్‌లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్‌ ఫైనల్‌కు ముందుగా వాళ్లు అశ్విన్‌కే పిలుపునిచ్చారు.

ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు
అయితే, తాను మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్‌ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్‌ మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లో ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్‌ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్‌ రెండు క్లబ్‌ మ్యాచ్‌లు ఆడాడు.

ఆ తర్వాతే ఆసీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్‌కే. వాషింగ్టన్‌ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్‌ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు.

వరల్డ్‌కప్‌ జట్టులోనూ..
కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్‌ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్‌ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్‌ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే  ఆసీస్‌తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్‌ తీశాడు. మార్నస్‌ లబుషేన్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌?
WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్‌! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్‌ సెలక్టర్‌

Advertisement

What’s your opinion

Advertisement