చెన్నై ఓపెన్‌ చాంపియన్‌ సుమిత్‌ నగాల్‌  | Sakshi
Sakshi News home page

చెన్నై ఓపెన్‌ చాంపియన్‌ సుమిత్‌ నగాల్‌ 

Published Mon, Feb 12 2024 3:47 AM

Chennai Open Champion Sumit Nagal - Sakshi

భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ స్వదేశంలో తొలిసారి ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో సుమిత్‌ విజేతగా నిలిచాడు.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 121వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–1, 6–4తో 114వ ర్యాంకర్‌ లుకా నార్డీ (ఇటలీ)పై గెలిచి తన కెరీర్‌లో నాలుగో ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ టైటిల్‌ సాధించాడు. విజేతగా నిలిచిన సుమిత్‌కు 18,230 డాలర్ల (రూ. 15 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement