కరీంనగర్‌: ఈసారి సర్వత్రా ఆసక్తి | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. ఈసారి సర్వత్రా ఆసక్తి

Published Thu, Aug 10 2023 4:43 PM

Who Will Next Incumbent in Karimnagar Constituency - Sakshi

ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి  నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం.

40 వేల ఓట్లు మున్నూరు కాపులు

 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు

 22 వేల ఓట్లు పద్మ శాలీలు

 29 వేల ఓట్లు ఎస్సీలు 

 14 వేల ఓట్లు ముదిరాజ్

 9 వేల ఓట్లు గౌడ 

 8 వేల క్రిస్టియన్ ఓట్లు 

1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు.

బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు

2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది.

గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు

  • ఆర్థికంగా బలమైన నేత...
  • మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21
  • ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం
  • ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం
  • నిత్యం ప్రజలతో మమేకం 
  • బలమైన క్యాడర్

బలహీనతలు

  • నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ.
  • ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం.
  • తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు.
  • రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు.
  • మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు.
  • బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం.
  • కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు.
  • ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం.

చేసిన పనులు

  • కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి.
  • ఐటీ టవర్ నిర్మాణం.
  • 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం.
  • 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. 
  • మెడికల్ కళాశాల మంజూరు.
  • టీటీడీ దేవాలయం.
  • కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము 
  • ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ 
  • మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, 
  • ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్.

చేయని పనులు

  • 24 గంటల నీటి సరఫరా
  • విలీన గ్రామాల సమస్య
  • డంప్ యార్డ్ ప్రధాన సమస్య
  • ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం
  • నగరంలో పార్కింగ్ సమస్య
  • నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం 
  • రక్షణ వాల్స్ కు బీటలు రావడం
  • అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి
  • డబుల్ బెడ్ రూమ్  హామీ నెరవేర్చలేకపోవటం

ప్రత్యర్థులు...

బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు.

2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో  ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ..

కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. 

పొన్నం ప్రభాకర్ :

పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. 
మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు?

మేనేని రోహిత్ రావు :

కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు....
వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు.

కొత్త జైపాల్ రెడ్డి...

ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా  ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 

2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.

Advertisement
Advertisement