‍విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్ | Sakshi
Sakshi News home page

అధికారం కోసం రాజకీయం.. మిలింద్ దేవరా రాజీనామాపై రౌత్ వ్యాఖ్యలు

Published Sun, Jan 14 2024 12:56 PM

No Loyalty Only Politics Sanjay Raut Jibe On Milind Deora Exit - Sakshi

ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. 

" విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని  కాంగ్రెస్‌కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు.

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 

'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. 

Congress leader Milind Deora resigns from the primary membership of Congress

"Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH

— ANI (@ANI) January 14, 2024

ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి  ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు..

Advertisement
Advertisement